India Pakistan 1965 war : భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి గాంధీ కారణం అనే బలమైన వాదన దేశంలో ఉంది. క్రమంగా ఈ వాదన మారుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్‌చంద్రబోస్ పాత్ర ప్రస్తుతం తెరపైకి వచ్చింది. అలాగే భారత్–పాకిస్తాన్ యుద్ధాల సమయంలోనూ అనేక మంది ప్రాణాలకు తెగించారు. భారత చరిత్రలో యోధులు, నాయకుల కథలు ప్రసిద్ధి చెందినా, సాధారణ పౌరుల సూక్ష్మమైన శౌర్యాలు వెలుగులోకి రాకుండానే కనుమరుగయ్యాయి. 1965లో భారత–పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో ఒక అసాధారణ ఘట్టం దీనికి స్పష్టమైన ఉదాహరణ.
భారత్–పాకిస్తాన్ మధ్య రైలు..
1965లో భారత–పాకిస్తాన్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు గురయ్యాయి. గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో సర్ క్రీక్ భూభాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో కాశ్మీర్‌లో ’ఆపరేషన్ జిబ్రాల్టర్’ పేరిట ముంపు దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైనికులు స్థానికుల దుస్తుల్లో తిరుగుబాటుకు ప్రయత్నించారు. ఈ ద్వంద్వ దాడులు యుద్ధాన్ని అనివార్యం చేశాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో, రాజస్థాన్‌లోని బార్మీర్ జిల్లా నుంచి పాకిస్తాన్‌లోని హైదరాబాద్ సింధ్ వరకు రైలు సేవలు కొనసాగుతూ ఉన్నాయి. వారానికి రెండు రోజులు నడిచే ఈ రైలు, రెండు దేశాల మధ్య ఆర్థిక–సాంస్కృతిక బంధాన్ని సూచించింది. ఇది కేవలం రవాణా మార్గం కాదు, శాంతి ఆశయాల సంకేతం. రాజస్థాన్ నుంచి మన దేశ సరిహద్దులోని చివరి రైల్వే స్టేషన్ మునాబావ్‌ను దాటుకుని ఈ రైలు పాకిస్తాన్‌లోని కోక్రాపార్ గ్రామం మీదుగా మరో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైదరాబాద్ సింధ్‌కు చేరుకుంటుంది. ఈ మార్గం థార్ ఎడారి మీదుగా ఉంది. రెండు దేశాల పౌరులకు ఆర్థిక లింక్‌గా ఉపయోగపడింది. ప్రత్యేకించి, పాకిస్తాన్‌లోని థార్‌పార్కన్ జిల్లాలో 80 శాతం హిందూ జనాభా ఉండటం ఈ సేవకు మరింత ప్రాముఖ్యత ఇచ్చింది. ఆ కాలంలో ఈ ప్రాంతం హిందూ–ముస్లిం సామరస్యానికి చిహ్నంగా నిలిచింది, ఈ రైలు సేవ యుద్ధ మేఘాల మధ్య కూడా కొనసాగడం రెండు దేశాల మధ్య అవిభాజ్యతను గుర్తు చేస్తుంది.
పాకిస్తాన్ యుద్ధ ప్రకటన..
ఒక రోజు, రైలు పాకిస్తాన్‌లోకి వెళ్లింది. తిరిగి భారత్‌కు వస్తున్న సమయంలో పాకిస్తాన్ యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించింది. సరిహద్దులను వెంటనే మూసివేసే చర్యలు మొదలయ్యాయి. ఈ సమయంలో రైలు పాకిస్తాన్‌లోని కోక్రాపార్ స్టేషన్ వద్ద ఆగి ఉంది. ప్రయాణికులంతా భారతీయులే. వారు చిక్కుకుంటే, పాకిస్తాన్ వారిని యుద్ధ ఖైదీలుగా మార్చి భారత్‌పై రాజకీయ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించింది. సిగ్నల్ వ్యవస్థ లేకపోయినా, అధికారుల అనుమతి లేకపోయినా, అతను త్వరగా నిర్ణయం తీసుకున్నాడు. రైలును పూర్తి వేగంతో నడిపి, సరిహద్దు మూసే ముందు భారత్‌లోకి తీసుకువచ్చాడు. మునాబావ్ స్టేషన్‌కు చేరిన వెంటనే సరిహద్దు సీల్ చేయబడింది. ఈ చర్య వందలాది ప్రయాణికులను మాత్రమే కాక, భారత దౌత్య స్థితిని కూడా కాపాడింది.
డ్రైవర్ సాహసానికి గుర్తింపు?
ఈ సాహసకర్త డ్రైవర్ పేరు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ప్రభుత్వం అతన్ని సత్కరించిందా, పురస్కారాలు ఇచ్చిందా అనేది చారిత్రక రికార్డుల్లో లేదు. అయినప్పటికీ, అతని చర్య ప్రాణాలకు తెగించిన ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. యుద్ధ సమయంలో ఒక సాధారణ ఉద్యోగి, అధికారాలను పక్కనపెట్టి జాతి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అసాధారణం. ఈ ఘట్టం సైనిక యోధుల కథల మధ్య మెరిసిన మణి. కానీ దాని విస్తృత ప్రభావాన్ని చర్చించకపోవడం చరిత్ర లోపం. యుద్ధం ముగిసిన తర్వాత, ఈ రైలు సేవలు తాత్కాలికంగా ఆగిపోయాయింది.
ఈ ఘట్టం భారత చరిత్రలో సామాన్య పౌరుల పాత్రను తెలియజేస్తుంది. యుద్ధాలు సైనికులతో మాత్రమే పరిమితం కావు. డ్రైవర్ వంటి వ్యక్తుల చిన్న నిర్ణయాలు భారీ పరిణామాలకు దారితీస్తాయి. అయితే, ఇలాంటి కథలు మరచిపోవడానికి కారణం చరిత్ర గ్రంథాలు పెద్ద ఘట్టాలపై దృష్టి పెట్టడం. ఇది నేటి తరాలకు ప్రేరణ కోల్పోవడానికి దారితీస్తుంది.