తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. రిజిష్టర్ చేసుకుంటే ఉద్యోగం పక్కా..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ ఇస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ కొన్ని రోజుల క్రితం విడుదల కాగా తాజాగా టాస్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణ పొందవచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, బీటెక్, బీఫార్మసీ, బీఈ, ఎంసీఏ ఇతర కోర్సులు […]

Written By: Navya, Updated On : November 21, 2020 5:47 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ ఇస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ కొన్ని రోజుల క్రితం విడుదల కాగా తాజాగా టాస్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణ పొందవచ్చు.

పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు, బీటెక్, బీఫార్మసీ, బీఈ, ఎంసీఏ ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులు టాస్క్ తో రిజిష్టర్ చేసుకోవచ్చు. మార్కులు తక్కువగా వచ్చినా, ఎక్కువగా వచ్చినా రిజిష్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్కులతో సంబంధం లేకుండా తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరేలా టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తోంది. అయితే కంపెనీల షరతులను బట్టే విద్యార్థులు ప్లేస్ మెంట్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎవరైతే టాస్క్ తో రిజిష్టర్ చేసుకుంటారో ఆ విద్యార్హులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ను నేర్చుకునే సౌకర్యం ఉంటుంది. విద్యార్థులు ప్లేస్ మెంట్ డ్రైవ్స్ లో పాల్గొనే అవకాశం ఉండటంతో పాటు విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ఛాన్సులు కూడా లభిస్తాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా విద్యార్థులు వచ్చే నెల 27వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

http://www.task.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.