https://oktelugu.com/

కరోనాతో అమెరికాలో మరణ మృదంగం

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది. ఈ వైరస్‌ వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా వ్యాక్సిన్‌ కూడా లేకుండాపోయింది. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ తయారీ కోసం కృషి చేస్తున్నా ఏమాత్రం రిజల్ట్‌ దక్కడం లేదు. అందుకే ప్రజల్లోనూ భయం పోవడం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతోంది. Also Read: ట్రంప్‌ మరో భారీ కుట్ర చైనాలో మొదలైన ఈ వైరస్‌ ఏ మేర ప్రభావం […]

Written By: , Updated On : November 21, 2020 / 06:14 PM IST
Follow us on

Corona Virus

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది. ఈ వైరస్‌ వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా వ్యాక్సిన్‌ కూడా లేకుండాపోయింది. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ తయారీ కోసం కృషి చేస్తున్నా ఏమాత్రం రిజల్ట్‌ దక్కడం లేదు. అందుకే ప్రజల్లోనూ భయం పోవడం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతోంది.

Also Read: ట్రంప్‌ మరో భారీ కుట్ర

చైనాలో మొదలైన ఈ వైరస్‌ ఏ మేర ప్రభావం చూపిందో ఖచ్చితంగా తెలియదు కానీ అమెరికాను మాత్రం అతలాకుతలం చేసింది. అయితే ఆ మధ్య అమెరికాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని చెప్పినప్పటికీ మళ్లీ ఆ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో ప్రతి నిమిషానికి ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా అమెరికన్లను మహమ్మారి బలి తీసుకుంది.

ప్రస్తుతం అక్కడ 45.71 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో అక్కడి ఆసుపత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. సరిపడా పడకలు లేక ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, విశ్రాంతి సముదాయాలు సహా వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లోనూ పడకలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Also Read: మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.3 లక్షలు వేస్తున్న మోదీ.. నిజమేనా..?

రెండు మూడు వారాల క్రితం వరకు రోజుకు 70-80 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ ఒక్కరోజే లక్షా 55 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 1700 మరణాలు సంభవిస్తే.. రెండు నుంచి మూడు వారాలు గడిచేటప్పటికి రోజుకు సుమారు 3 వేల మంది మృతిచెందవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 13 లక్షల మందికి పైగా మృతి చెందారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 1,22,68,678 కరోనా కేసులు నమోదవగా.. 2,60,235 మంది మృతి చెందారు. అయితే.. కరోనా ప్రారంభంలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సీరియస్‌గా తీసుకోకపోవడమే దీనంతటికి కారణమని అక్కడి ప్రజలు వాపోతున్నారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు