Maharashtra: పిడుగు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. సాధారణంగా పిడుగు మన కంటికి కనిపించదు. దాని శబ్దం వింటేనే చెవులు చిల్లు పడినట్లుగా అనిపిస్తుంది. ఎత్తయిన చెట్లపై మంటలు లేచినప్పుడు పిడుగు పడిందని భావిస్తాం. సెకన్లలో ప్రాణం తీసేస్తుంది. ఓ మెరుపులా ఉన్నా.. అది తాకితే వేల ఓట్ల విద్యుత్ ఒంట్లోకి చేరి క్షణాల్లో మనిషిని బూడిద చేస్తుంది. మహారాష్ట్రలో పడుగుపాటు దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు పడడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో బొగ్గుగనిలో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై పిడుగు పడింది. దీంతో అతను స్పాట్‌లో కుప్పకూలిపోయాడు. ఈ విషాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రాపూర్ జిల్లా భద్రావతి తాలూకా మజ్రీ బొగ్గు గనిలో పని చేస్తున్న కార్మికుడు.. పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది. పిడుగు ధాటికి బాధిత కార్మికుడు.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బీహార్‌కు చెందిన బాబుధన్‌యాదవ్‌గా గుర్తించారు.
కారణం ఏంటి?
సాధారణంగా పిడుగులు ఎత్తయిన భవనాలు, చెట్లపైనే పడుతుంది. అందుకే వర్షం కురిసినప్పుడు చెట్ల కింద నిలబడొద్దని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. కాగా, నేలపై ఏదైనా లోహం ఉంటే మాత్రమే పిడుగును ఆకర్షిస్తుంది. అయితే చంద్రాపూర్‌లో జరిగిన పిడుగుపాటు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడింది. దీనిపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిడుగ పడినప్పుడు వ్యక్తి చేతిలో పిడుగును ఆకర్షించే వస్తువు ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. లేదంటే అతను నడుచుకుంటూ వెళ్లే ప్రాంతలో భూమి లోపలై ఏదైనా లోహం ఉండి పిడుగును ఆకర్షించి ఉంటుందా అని భావిస్తున్నారు.
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ పిడుగుపాటు దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు తమకు భయంతో గుండె దడ మొదలైందని కామెంట్లు పెడుతున్నారు.
