
Mahesh-Trivikram Movie US Rights: మహేష్ బాబు యూఎస్ బాక్సాఫీస్ కింగ్ గా ఉన్నారు. ఆయన ప్లాప్ మూవీస్ కూడా వన్ మిలియన్ ఈజీగా రాబట్టేస్తాయి. యూఎస్ ఆడియన్స్ మహేష్ చిత్రాలను అంతగా ఇష్టపడతారు. మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు ఏకంగా $ 2.89 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఆయన కెరీర్లో హైయెస్ట్ యూఎస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా శ్రీమంతుడు ఉంది. శ్రీమంతుడు యూఎస్ వసూళ్లకు రెట్టింపు ధరకు SSMB 28 రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. యూస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదలకు నెలల ముందే ఫ్యాన్సీ ధర చెల్లించి హక్కులు దక్కించుకున్నారట.
అందుతున్న సమాచారం ప్రకారం $4 నుండి $4.25 మిలియన్ వసూళ్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగుతుందట. పాన్ ఇండియా చిత్రాలకు మించి మహేష్ మూవీ కోసం యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడ్డారు. మరి కొండంత టార్గెట్ తో బరిలో దిగుతున్న మహేష్-త్రివిక్రమ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారులో భారీ లగ్జరీ హౌస్ సెట్ ఏర్పాటు చేశారట. ఈ సెట్ కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారు.
ఆ హౌస్ సెట్లో హీరో మహేష్, హీరోయిన్ పూజా హెగ్డే పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక శ్రీలీల సైతం షూటింగ్ లో జాయిన్ అవుతున్నారట. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ మహేష్ అత్తగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ మహేష్ తాత పాత్ర చేస్తున్నారట.

జగపతిబాబు విలన్ గా అలరించనున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా… థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుందని వినికిడి. నిజానికి 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కొన్ని కారణాలతో అనుకున్న ప్రకారం షూటింగ్ జరగలేదు. కాగా త్వరలో మహేష్ రాజమౌళి షూట్లో పాల్గొననున్నారట. జిమ్ లో కసరత్తులు చేస్తూ కండలు పెంచుతున్న మహేష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాడీ పెంచుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Exclusive: #SSMB28 North America Rights are almost finalized. The breakeven mark will be around $4M-$4.25M depending on release.
Record business for what is considered to be more of regional film and huge expectations on this one in USA 🇺🇸
— Venky Reviews (@venkyreviews) March 4, 2023