
Mahesh – Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతలా అయితే ఎదురు చూస్తున్నారో, ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా చిత్రాలు అప్పట్లో థియేట్రికల్ పరంగా పెద్దగా ఆడకపోయినా టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఆడియన్స్ ఎగబడిమరీ చూసారు.
ఇప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు వచ్చాయంటే చాలు, ఆడియన్స్ పనులన్నీ మానుకొని మరీ టీవీ ముందు కూర్చుంటారు.అలాంటి సినిమాలు వీరి కాంబినేషన్ నుండి వచ్చాయి కాబట్టే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా పై అంతటి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాకి క్రేజీ బిజినెస్ డీల్స్ కూడా వస్తున్నాయి.ఇప్పటికే డిజిటల్ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కి 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం.
అలా ఇప్పటికీ టైటిల్ కూడా ఖరారు కానీ ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ ని చూస్తూ ఉంటే ఈ కాంబినేషన్ పవర్ ఎలాంటిదో అర్థం అవుతుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియా లో గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి.కానీ ఈమధ్యనే త్రివిక్రమ్ ఒక అదిరిపొయ్యే టైటిల్ ని ఫిక్స్ చేసాడని, ఉగాది కానుకగా ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.

థమన్ సంగీతం అందిస్తుండగా, సూర్య దేవర నాగవంశీ ( భీమ్లా నాయక్ నిర్మాత) ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని, ప్రతీ ప్రాంతం లో రాజమౌళి రికార్డ్స్ కి దగ్గరగా వెళ్తుందని ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ నమ్మకంతో చెప్తున్నాడు.