
Chiranjeevi- Politics: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేక స్థానం. టాలివుడ్ లో ఆయన క్రేజ్ గురించి చెప్పనక్లర్లేదు. ఎటువంటి బ్యాక్ బోన్ లేకుండా స్వశక్తితో తెలుగు సినిమా జగత్తులో మెగాస్టార్ గా అవతరించారు. కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానులను కొల్లగొట్టారు. యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే చిరంజీవికి సేవారంగంపై దృష్టి ఎక్కువ. అందుకే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పేరిట వేలాది మందికి వైద్యసేవలందించారు. అదే స్ఫూర్తితో రాజకీయాలకు వెళ్లారు. సుమారు పదేళ్ల పాటు సినిమారంగానికి దూరమయ్యారు. అయితే అందుకు తాను భారీ మూల్యం చెల్లించుకున్నానని కూడా చిరంజీవి చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఉమ్మడి ఏపీలో అన్ని స్థానాల నుంచి పోటీచేశారు. అయితే ఆ ఎన్నికల్లో కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు. పాలకొల్లు, తిరుపతిల నుంచి పోటీచేసిన చిరంజీవి తిరుపతిలోనే గెలుపొందారు. అటు తరువాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. రాజకీయాలు తన మనసుకు సూటవ్వవని తెలుసుకొని గుడ్ బై చెప్పారు. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో అదే దూకుడుతో బోళా శంకర్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు చేసుకోవాలన్నదే చిరంజీవి అభిమతంగా తెలుస్తోంది.
దాదాపు పది సంవత్సరాలు సినిమారంగానికి దూరమైన చిరంజీవి క్రేజ్ ఇసుమంత కూడా దక్కలేదు. ఇప్పటికీ చిరంజీవి కోసం దర్శకులు, నిర్మాతలు క్యూకడుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం నిర్మించేందుకు ముందుకొస్తున్నారు. అయితే చిరు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఒక్క వాల్తేరు వీరయ్య చిత్రానికే రూ.40 కోట్లు ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ లెక్కన పదేళ్లలో రూ.400 కోట్ల ఆదాయం చిరంజీవికి దూరమైంది. రాజకీయాల్లో రాక మునుపు సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని చిరంజీవి ఎక్కువ గా స్థిరాస్థుల రూపంలో పెట్టుబడి పెట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖ నగరాల్లో చిరంజీవికి స్థిరాస్తుల రూపంలో రూ.1200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు రామ్ చరణ్ సైతం తండ్రినే అనుసరిస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవి సినిమాల ద్వారా ఆదాయం కోల్పోవడమే కాకుండా.. పార్టీకి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది. రాజకీయాల్లో రాకుండా ఉంటే ఇప్పుడున్న ఆస్తికి డబుల్ సంపాదించే అవకాశం ఉండేదన్న టాక్ నడుస్తోంది. పైగా సరిగ్గా కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడే చిరంజీవి సినిమా రంగాన్ని వీడారు. అప్పటివరకూ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా వెనుకడుగు వేశారు. 2009లో మాత్రం టెంప్ట్ అయ్యారు. అందుకు తగ్గట్టుగా మూల్యం చెల్లించుకున్నారు.