Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఒక ‘సిగ్గరి’. పెద్దగా మాట్లాడరు.. వివాదాల జోలికి వెళ్లరు. మీడియా ముందు మాట్లాడడానికి తటపటాయిస్తారు. అలాంటి సైలెన్స్ కామ్ హీరో తాజాగా తన అభిమానుల కోసం మారిపోయారు. తన సిగ్గును అంతా వదిలేసి ఏకంగా అందరికీ షాకిచ్చే పని చేశారు.
మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొదటి వీకెండ్ ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తో అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిసింది.
Also Read: Heroes Who Married Item Girls: ఐటమ్ సాంగ్స్ చేసేవారిని వివాహం చేసుకున్న హీరోలు వీరే
ఈ క్రమంలోనే నిర్మాతలు కర్నూలులో ‘సర్కారు వారి పాట’ సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మహేష్ బాబులో ఉత్సాహం పొంగుకొచ్చింది. ‘ఒక్కడు’ సినిమా తర్వాత ‘సర్కారు వారి పాట’ సినిమాకు మళ్లీ కర్నూలు రావడం చాలా సంతోషంగా ఉందని మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. నిజానికి ప్రీ రిలీజ్ వేడుకని ఇక్కడే జరపాలని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని మహేష్ తెలిపాడు. ఇక నిర్మాతలైన ‘మైత్రీ’, 14 రీల్స్ కు మహేష్ థ్యాంక్స్ చెప్పాడు. సర్కారు వారి పాట మరో పోకిరీ, దూకుడును తలపించిందని నాన్న కృష్ణ, కూతురు సితార చెప్పిందని.. ఇందులో తన లుక్ బాగుందని అన్నారని మహేష్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఎప్పుడూ బయట స్టేజీలపై కనీసం మాట్లాడడానికి కూడా సందేహించే మహేష్ బాబు ఏకంగా డ్యాన్స్ చేసి అరలించారు. స్టేజీపై తమన్, డ్యాన్సర్లు స్టెప్పులేయడం చూసి.. ఊపు వచ్చి స్టేజీపైకి వచ్చారు. తన ‘మా.. మా.. మాస్’ పాటకు స్టెప్పులేసి మహేష్ అలరించారు. హీరోగా ఎంట్రీ ఇప్పటికి 23 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో మహేష్ బాబు ఇలా స్టేజీపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి.. ఇదే అందరినీ అశ్చర్యపరిచింది.
Also Read: Viral Photo: క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది.. ఎవరో తెలుసా?