Kiran Kumar Reddy: కాంగ్రెస్ లోకి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ.. ఢిల్లీ టూర్ అందులో భాగమేనా?

Kiran Kumar Reddy: ఏపీ రాజకీయ సర్కిల్ లో ఓ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ లో తెరంగేట్రం చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. తెలంగాణా ఉద్యమం చివరి దశలో ఎగసిపడుతున్న వేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా క్లీష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మెరుగైన పాలన అందించగలిగారని ఇప్పటికీ నాయకులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆయన కాంగ్రెస్ […]

Written By: Dharma, Updated On : May 17, 2022 11:22 am
Follow us on

Kiran Kumar Reddy: ఏపీ రాజకీయ సర్కిల్ లో ఓ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ లో తెరంగేట్రం చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. తెలంగాణా ఉద్యమం చివరి దశలో ఎగసిపడుతున్న వేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా క్లీష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మెరుగైన పాలన అందించగలిగారని ఇప్పటికీ నాయకులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆయన కాంగ్రెస్ కు దూరమయ్యారు. 2014 తరువాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారన్న వార్త ఏపీ రాజకీయాల్లో చక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి.

Kiran Kumar Reddy- Rahul Gandhi

అధికార పక్షం, ప్రధాన విపక్షం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. వైసీపీ నాయకులు ‘గడపగపడకూ వైసీపీ ప్రభుత్వం’ పేరిట గ్రామాలను, పట్టణాలను చుట్టేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై టీడీపీ ‘బాదుడే బాదుడు’ పేరిట భారీ నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌలురైతు భరోసా యాత్ర’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు సాగిస్తున్నారు. మరోవైపు ప్రజా పోరాటాలతో వామపక్షాలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపరంగా చిన్నచితకా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Also Read: Revanth Reddy: కేసీఆర్, అమిత్ షాను ఇరికించేసిన రేవంత్ రెడ్డి

దీంతో ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్న తలంపులో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఉంది. అందుకే 2014కు ముందు పార్టీలో క్రియాశీలక పాత్ర వహించిన నాయకులకు అధిష్టానం నుంచి పిలుపులొస్తున్నాయి. అందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన పెద్దలు పిలిచి కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆయన ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. రెండు, మూడు రోజులు అక్కడే ఉండి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్టు సమాచారం. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమై ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Kiran Kumar Reddy

వ్యూహాత్మకంగా కాంగ్రెస్..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతంపై అధిష్టానం ద్రుష్టిపెట్టింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేథోమథనం సీరియస్ గా జరిగిన దరిమళ కీలక మార్పుల దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధిష్టానం కీలక నిర్ణయాలను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీపైనా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు తిరిగి పార్టీలోకి రప్పించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించారు. గతంలో ఇటువంటి ప్రయత్నాలే జరిగినా.. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తిరిగి పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన్ను రప్పించే బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజుకు అధిష్టానం అప్పగించినట్టు సమాచారం. 2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే 2014 తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ లో చేరుతారనే ప్రచారం కూడ కొంతకాలం సాగింది. అయితే ఆయన ఏ పార్టీలో కూడ చేరలేదు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు మాత్రం టీడీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Monsoon 2022: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్

అటువైపే మొగ్గు..
పూర్వశ్రమం, తన రాజకీయ ఉన్నతికి దోహదపడిన కాంగ్రెస్ పార్టీలోనే కిరణ్ కుమార్ రెడ్డి చేరేందుకు మొగ్గుచూపినట్టు సమాచారం. తమ స్వగ్రామానికి చెందిన తన సన్నిహితులు, మిత్రులు, అనుచరులతో కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయమై చర్చించారని ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ లాంటి పదవిని అప్పగించే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై కిరణ్ కుమార్ రెడ్డి బాధతో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, అటు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి వారు కలయికకు ప్రయత్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని అనుకూలిస్తే కొద్దిరోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇకపోతే ఏపీ పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Recommended Videos:

Tags