Heroes Who Married Item Girls: తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగులకు ఉన్న విలువ గురించి అందరికి తెలిసిందే ఎన్టీఆర్ కాలం నుంచి కూడా జ్యోతిలక్ష్మి, జయమాలిని సిల్క్ స్మిత, అనురాధ, డిస్కోశాంతి ఐటమ్ సాంగులలో తమదైన శైలిలో నాట్యం చేసి అందరిని మెప్పించారు. అసలు ఐటమ్ సాంగ్ లేని సినిమాయే ఉండేది కాదు. అంతటి డిమాండ్ ఉన్న ఐటమ్ సాంగుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. సినిమా విజయంలో అదే కీలక పాత్ర పోషించేది. దీంతో అందులో నటించే వారికి కూడా మంచి గుర్తింపు ఉండేది. కానీ కాలక్రమంలో ఐటమ్ సాంగుల విలువ కాస్త తగ్గింది. ఇప్పుడు కూడా ఆ జోష్ ఉన్నా పద్ధతులు మారాయి.
అప్పుడు సినిమాలో ఐటమ్ సాంగు చేయడానికి ప్రత్యేకించి ఉన్న వారితోనే నడిపించేవారు. ప్రస్తుతం హీరోయిన్లే ఐటమ్ సాంగులు చేయడం గమనార్హం. టెంపర్ సినిమాలో కాజల్, పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగులలో నటించి ప్రేక్షకులను అదరగొట్టారు. దీంతో ఐటమ్ సాంగుల తీరే మారిపోయింది. ప్రస్తుతం ఐటమ్ సాంగు కోసం ప్రత్యేకంగా ఎవరు రావడం లేదు. హీరోయిన్లే నర్తించడంతో ఐటమ్ గర్ల్ పాత్రలు కనిపించడం లేదు. తరువాత కాలంలో కూడా అల్ఫోన్సా, రక్ష లాంటి వారు వచ్చినా వారు కూడా తెరమరుగైపోయారు.
Also Read: Sai Pallavi SVP Movie : మహేష్ బాబు మూవీ చూసేందుకు మారువేషంలో వచ్చిన సాయిపల్లవి.. వైరల్ వీడియో
పారితోషికం కూడా ఎక్కువగా రావడంతో హీరోయిన్లే ఐటమ్ సాంగులలో నటిస్తూ తమకు తిరుగులేదనిపిస్తున్నారు. రెమ్యూనరేషన్ భారీగా ముడుతుండటంతో ఇదే బాగుందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్లు ఐటమ్ భామలుగా చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐటమ్ సాంగులకు నటించిన డిస్కోశాంతి హీరో శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా. శ్రీహరి మాత్రం దివంగతులు కావడం అందరిని కలచివేసింది.
ఇక మరో ఐటమ్ సాంగ్ భామ అనుకృతి శర్మ హీరో జేడీ చక్రవర్తిని వివాహం చేసుకుంది. శివ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన చక్రవర్తి తరువాత హీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. గులాబి సినిమా ద్వారా హీరోగా మారి తన ప్రతిభను చూపించాడు. అక్కడి నుంచి వరుసగా హీరోగా సినిమాలు చేసినట్లు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అనగనగా ఒక రోజు, ప్రేమకు వేళాయెరా, బొంబాయి ప్రియుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. దర్శకుడిగా మారి కూడా సినిమాలు చేశారు. శ్రీదేవి సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ చేసిన అనుకృత శర్మను పెళ్లి చేసుకుని జీవితంల సెటిల్ అయ్యారు.
Also Read:Pranitha Subhash Seemantham: పసుపు పచ్చని చీరలో బాపు బొమ్మకు సీమంతం