
Mahesh Babu- Trivikram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ వేదికగా కీలక ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 28 ఆగస్టులో ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. ఈ క్రమంలో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. ఏప్రిల్ చివరికల్లా 90 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేయాలనే టార్గెట్ తో ముందుకు వెళుతున్నారు. అందుకే మహేష్ ఒక ఫ్యామిలీ ట్రిప్ కూడా మిస్ అయ్యారు. నమ్రత తన ఇద్దరు పిల్లలతో ఫారిన్ వెళ్లారు. మహేష్ మాత్రం ఇండియాలో ఉండిపోయారు.
ఉగాది కానుకగా అప్డేట్ ఆశించిన మహేష్ ఫ్యాన్స్ కి భంగపాటే ఎదురైంది. షూటింగ్ చాలా వరకు జరిగింది. ఆగస్టులో విడుదల అంటున్నారు. కాబట్టి ఉగాది వేళ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఖాయమని ఫ్యాన్స్ భావించారు. వారి ఆశల మీద టీమ్ నీళ్లు చల్లింది. మహేష్ మూవీ అప్డేట్ కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. అయితే సరైన సమయంలో అదిరిపోయే అప్డేట్ వస్తుంది అంటూ ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
ఉగాదికి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడానికి బలమైన కారణమే ఉందట. మహేష్ చిత్రానికి టైటిల్ నిర్ణయించే విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ అవుతున్నారట. ఆయన ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఎస్ఎస్ఎంబి 28 టైటిల్ త్రివిక్రమ్ ఇంకా ఫిక్స్ చేయలేదట. దీంతో ఉగాది అప్డేట్ స్కిప్ చేశారట. టాలీవుడ్ లో ఈ మేరకు ప్రచారం జరుగుతుంది. కాగా ఈ చిత్ర టైటిల్ విషయంలో కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. అమ్మ మాట, అడవిలో అర్జునుడు అంటూ రకరకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి.

త్రివిక్రమ్ టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మొదటి అక్షరం అ తో మొదలయ్యేలా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతారు. మరి మహేష్ కోసం ఆయన ఎలాంటి టైటిల్ తో వస్తారో చూడాలి. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. జయరామ్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం.