Homeజాతీయ వార్తలుMinister Malla Reddy: మల్లన్న మళ్లీ ఏసేశాడు!

Minister Malla Reddy: మల్లన్న మళ్లీ ఏసేశాడు!

Minister Malla Reddy
Minister Malla Reddy

Minister Malla Reddy: బీఆర్‌ఎస్‌లో కామెడీ లీడర్‌.. తెలంగాణలో కామెడీ మంత్రి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మల్లారెడ్డి. ఈయన ఏది చేసినా నవ్వులు మాత్రం ఖాయం.. అసెంబ్లీలో స్పీచ్‌ ఇచ్చినా.. పార్టీ సమావేశాల్లో ప్రసంగించినా.. మీటింగ్‌లులో మాట్లాడినా.. కాలేజీ విద్యార్థులకు మోటివేషన్‌ క్లాస్‌లు చెప్పినా పిచ్చ కామెడీ మాత్రం ఖాయం. చివరకు ఆయనే అంగీకరించారు.. ‘నేను ఏం మాట్లాడినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది’ అని అట్లుంటది మల్లనతో.. తాజాగా మంత్రిగారు మళ్లీ ఏసేశారు.

ఐటీ దాడులపై ఎక్స్‌పీరియన్స్‌..
మంత్రి మల్లారెడ్డిపై ఇటీవల ఐటీ రైడ్స్‌ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మామూలు రచ్చ చేయలేదు. తన కొడుకును కొట్టారని ఒకసారి, ఐటీ అధికారుల లాప్‌టాప్‌ అపహరించి మరోసారి.. సుమారు 5 రోజుల ఐటీ దాడిని రక్తికట్టించారు అమాత్యుల వారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన మంత్రిగారిని ఐటీ దాడుల గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఐటీ దాడులపై ఎక్స్‌పీరియన్స్‌ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మీకు అనుభం లేదు.. నాకు అనుభవం ఉంది అని పేర్కొన్నారు..

2094 ఐటీ దాడులట..
ఇక ఐటీ దాడుల అనుభవం వివరిస్తూ మంత్రిగారు మళ్లీ ఏసేశారు. తనపై 2094 ఒకసారి ఇన్‌కం ట్యాక్స్‌ దాడి అయిది ఒకసారి.. అప్పుడు ఆరేళ్లు తిరిగి. మళ్లీ 2008లో ఇంకోసారి అయింది అంటూ తన నోటికి వచ్చింది మాట్లాడారు.

Minister Malla Reddy
Minister Malla Reddy

నెట్టింట్లో వైరల్‌..
ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఏది పడితే అది మాట్లాడడం మల్లారెడ్డికి అలవాటే. ఈ క్రమంలో ఐటీ దాడులపై అనుభవం చెబుతానంటూ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఒక కామెడీ సీన్‌ జోడించి వైరల్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version