https://oktelugu.com/

Heroine : లావుగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు గ్లామరస్ హీరోయిన్… ఎవరో గుర్తు పట్టారా? ఎంత మార్పు!

ప్రస్తుతం ఆమె ఎక్కువగా మలయాళం చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో అడపాదడపా చిత్రాలు చేస్తుంది. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న జీనీ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. భువనేశ్ అర్జునన్ ఈ చిత్రాన్ని ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

Written By: , Updated On : April 23, 2024 / 03:46 PM IST
Kalyani Priyadarshan

Kalyani Priyadarshan

Follow us on

Heroine : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. లక్ష్యం సాధించడానికి కష్టం పడాల్సిందే. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడో గ్లామరస్ హీరోయిన్. టీనేజ్ లో ఈ అమ్మాయి బొద్దుగా ఉండేది. కానీ ఆమె హీరోయిన్ కావాలని అనుకుంది. మరి హీరోయిన్ కి ఉండాల్సిన మొదటి లక్షణం.. ఫిట్ అండ్ స్లిమ్ బాడీ. సన్నగా నాజూగ్గా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శక నిర్మాతలు ఆఫర్స్ ఇస్తారు. అందుకే ఆమె బరువు తగ్గింది. నాజూగ్గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో మీరు గుర్తు పట్టారా?

ప్రముఖ స్క్రీన్ రైటర్ ప్రియదర్శన్ కుమార్తె అయిన కళ్యాణి ప్రియదర్శన్. ఈమె తల్లి లిస్సి హీరోయిన్ అండ్ మోడల్. తల్లి నట వారసత్వం తీసుకున్న కళ్యాణి ప్రియదర్శన్ నటిగా మారింది. ఆమె మొదటి సినిమా హలో. దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన హలో చిత్రంలో అక్కినేని అఖిల్ హీరో కావడం విశేషం. హలో ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది కాగా కమర్షియల్ గా ఆడలేదు.

అనంతరం సాయి ధరమ్ తేజ్ కి జంటగా చిత్రలహరి మూవీ చేసింది. ఈ చిత్రం సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేదు. వరుసగా మూడో చిత్రం కూడా తెలుగులోనే చేసింది. రణరంగం మూవీలో శర్వానంద్ కి జంటగా నటించింది. ఈ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ దెబ్బతో టాలీవుడ్ కి దూరం అయ్యింది.

ప్రస్తుతం ఆమె ఎక్కువగా మలయాళం చిత్రాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో అడపాదడపా చిత్రాలు చేస్తుంది. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న జీనీ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. భువనేశ్ అర్జునన్ ఈ చిత్రాన్ని ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. కృతి శెట్టి మరొక హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వామిగా గబ్బి, దేవయాని కీలక రోల్స్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.