సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రమేశ్ బాబు.. మహేష్ బాబు.. అప్పట్లో రమేశ్ బాబు హీరోగా క్లిక్ అయినా ఆ తర్వాత సినిమాలు ఆడక హీరోగా వైదొలిగారు. ఇక మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నారు.
Also Read: పెళ్లయిన ప్రతీ ఆడది ఏడవాల్సిందే అంటున్న పూరి..!
ఇక నిర్మాతగా మారి మహేష్ బాబుతో పలు సినిమాలు తీసిన రమేశ్ బాబుకు అందులోనూ ఫ్లాప్ లు రావడంతో దాన్ని వదిలేశారు. ప్రస్తుతం పెద్దగా వార్తల్లో ఉండడం లేదు.
అయితే మహేష్ బాబు నటనలో ఇంత స్థాయికి ఎదగడానికి కారణం రమేశ్ బాబు అట.. ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా చెప్పుకోవడం విశేషం.
Also Read: తెలుగు బ్యూటీకి క్రేజీ ఛాన్స్ లు.. రవితేజతో కూడా !
తాజాగా రమేశ్ బాబు బర్త్ డే ను పురస్కరించుకొని తన అన్నయ్యకు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ బాబు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను అన్నయ్య నుంచి ఎంతో నేర్చుకున్నాను. అన్నయ్య నుంచే క్రమశిక్షణ, అంకితభావం, అభిరుచి గుణాలను అలవరుచుకున్నాను. ఆయన ఆయురారోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు.
Here's wishing my Annaya a very happy birthday❤️ can easily say a part of my learning came from him… discipline, dedication and passion is what he selflessly passed on to me 🤗 Wishing you great health and much happiness always 🤗🤗🤗 pic.twitter.com/lpbLKbMR1e
— Mahesh Babu (@urstrulyMahesh) October 13, 2020