
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో నిర్మీతమవుతున్న మూవీలో మహేశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమాలో నటిస్తారు. అయితే దర్శకదీరుడు ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఈ మూవీని ప్రత్యకంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ కోసం ఈ సినిమా కథను ఎప్పుడో తయారు చేసుకోగా.. దానిని ఇప్పుడు తీస్తున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పడు రిలీజ్ అవుతుంది? అని ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టిస్తోంది. ఈ తరుణంలో హాట్ న్యూస్ సర్కిల్ అవుతోంది. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా బిగ్ అనౌన్స్ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.
రాజమౌళి కంపెనీలో నటించాలని ఏ హీరోకైనా ఉంటుంది. కానీ రాజమౌళి తాను రాసుకున్న కథలో సెలెక్టెడ్ హీరోస్ మాత్రమే అవకాశం ఇస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తీయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దీంతో రాజమౌళి #SSMB29 అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో తీస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. దీంతో ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ ఉంది. అనంతరం రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాత జక్కన్న రేంజ్ వరల్డ్ లెవల్లో దూసుకుపోయింది. దీంతో ఆయన తరువాత సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారు. అయితే తరువాతి సినిమాలో మహేష్ బాబు నటిస్తుండడంతో మరింత ఎగ్జైట్మెంట్ గా మారింది. అయితే ఈ సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన రాజమౌళి ఆ తరువాత దీని గురించి ఎలాంటి టాపిక్ తీయడం లేదు.

అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా బిగ్ అనౌన్స్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమైన ఆగస్టు 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ రాజమౌళి సినిమాకు టైం తీసుకోనున్నారు. అయితే మహేష్ బాబు బర్త్ డే అంటే ఆగస్టు 9న ఈ సినిమా గురించి ఫుల్ డిటేయిల్స్ ఇస్తారని తెలుస్తోంది. సో ఈసారి మహేశ్ బాబు బర్త్ డే చాలా గ్రాండ్ గా ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి అనుకున్న విధంగా జక్కన్న మహేష్ సినిమాను అదే రోజు చెబుతారా? లేక ముందే సర్ ప్రైజ్ చేస్తారా? అని అనుకుంటున్నారు.