
Mahesh Babu- Trivikram: మహేష్ బాబు 28వ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి గందరగోళమే. అనుకున్న సమయానికి షూటింగ్ మొదలుకాలేదు. ఫస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టాక మధ్యలో ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేర్పులు చేశారని, అందుకే ఫస్ట్ షెడ్యూల్ అర్థాంతరంగా నిలిపేశారనే టాక్ వినిపించింది. మరలా ఫ్రెష్ గా షూటింగ్ మొదలుపెట్టారట. అనంతరం హైదరాబాద్ లో రూ. 10 ఖర్చుతో ఒక భారీ హౌస్ సెట్ నిర్మించారు. అక్కడ చాలా రోజులు షూటింగ్ చేశారు. మహేష్ బాబు(Mahesh Babu), హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde)తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్ నందు పాల్గొన్నారని తెలిసింది.
సమ్మర్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని మొదట భావించారు. అయితే చిత్రీకరణ అనుకున్న ప్రకారం జరగలేదు. అందుకే 2024 సంక్రాంతికి పోస్ట్ ఫోన్ చేశారు. ఈ విడుదల తేదీ మీద మహేష్ ఫ్యాన్స్ సంతృప్తికరంగా ఉన్నారు. అయితే వాళ్లకు నిరాశతప్పదంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. సంక్రాంతి కానుకగా మహేష్ మూవీ విడుదల కాకపోవచ్చని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద అటు మహేష్ కి ఇటు త్రివిక్రమ్ కి ఆసక్తి లేదట. ఇద్దరూ ఎవరి వ్యాపకాల్లో వారు బిజీగా ఉంటున్నారట.

మహేష్ షూటింగ్ వదిలేసి మరోసారి విదేశీ ట్రిప్ కి వెళ్లారు. తిరిగి వచ్చాక కూడా ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ పూర్తి చేసే ఆలోచన చేయడం లేదట. నెక్స్ట్ మంత్ చేద్దాం ఇప్పుడు మూడ్ లేదన్నట్లు మాట్లాడుతున్నారట. ఇక త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పనులు చూసుకుంటున్నారట. ఇతర దర్శకులతో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రాల్లో కూడా త్రివిక్రమ్ పాత్ర ఉంటుంది. ఈ క్రమంలో ఆయన అటు వైపు దృష్టి పెట్టారట.
మొత్తంగా నిర్మాత నాగవంశీ ఇబ్బందులు పడుతున్నారట. ఈ చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆయనకు తలనొప్పిగా మారిందట. ఈ మేరకు పరిశ్రమలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. కాగా ఇటీవల #SSMB28 ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మహేష్ మాస్ అవతార్ అదిరిపోయింది. పూజా హెగ్డేతో పాటు శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.