
Akkineni Akhil On Agent: అక్కినేని అఖిల్ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా నేడు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరంగల్ లో వేలాది మంది అభిమానుల సమక్షం లో నిర్వహించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మూవీ యూనిట్ మొత్తం, ఎందుకో ఈ సినిమా పైన నమ్మకం లేదు అనే విధంగానే మాట్లాడారు.
ముందుగా అఖిల్ మాట్లాడుతూ ‘కలిసినప్పుడు ఎదో ఒకటి క్రేజీ గా చెయ్యాలని అనుకున్నాము. కానీ ఎదో చేసాము సార్’ అంటూ అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా ఆ మాట చెప్తున్నప్పుడు అఖిల్ ముఖకవళికలు చూస్తే సినిమా ఔట్పుట్ మీద నమ్మకం లేనట్టుగా అనిపించింది.ఇదే ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతున్న విషయం.
మరో పక్క సురేందర్ కూడా ‘నీకు ప్రారంభం లో ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను అనే అనుకుంటున్నాను. ఈ సినిమా నీకోసమే తీసా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటల్లో కూడా బలమైన నమ్మకం లేదు.ఈ చిత్రం పై కోటి ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఈ రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం మాట్లాడిన మాటలు చూసి నిరాశకి గురయ్యారు.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా హాజరైన నాగార్జున ఈ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి అంచనాలు పెంచుతాడు అనుకుంటే, ఆయన ఇప్పటి వరకు సినిమానే చూడలేదట. అలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చప్పగా సాగిపోయింది.కనీసం సినిమా అయినా ఫాస్ట్ గా నడుస్తుందో లేదో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగానే చప్పగా ఉంటుందా అనేది తెలియాలంటే ఈ నెల 28 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.