https://oktelugu.com/

Star Heroines: మై లైఫ్ మై రూల్స్… పెళ్లి కాకుండానే తల్లైన ఈ హీరోయిన్స్ వీరే!

Star Heroines: ఓ మహిళ పరాయి మగాడిని చూడటం, మాట్లాడటం కూడా తప్పనే భారతీయ సమాజం ఊహించని స్థాయికి ఎదిగింది. పెళ్లి కాకుండా తల్లి అవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇష్టమైన వాడితో గర్భం దాల్చడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం… హీరోయిన్ ఇలియానా తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రకటన చేశారు. నేను గర్భవతిని త్వరలో బిడ్డను కంటానని […]

Written By:
  • Shiva
  • , Updated On : April 24, 2023 / 08:00 AM IST
    Follow us on

    Star Heroines

    Star Heroines: ఓ మహిళ పరాయి మగాడిని చూడటం, మాట్లాడటం కూడా తప్పనే భారతీయ సమాజం ఊహించని స్థాయికి ఎదిగింది. పెళ్లి కాకుండా తల్లి అవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇష్టమైన వాడితో గర్భం దాల్చడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం… హీరోయిన్ ఇలియానా తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రకటన చేశారు. నేను గర్భవతిని త్వరలో బిడ్డను కంటానని చెప్పుకొచ్చారు. అభిమానులు, సన్నిహితులు ఇలియానాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే ఎవరి కారణంగా ఇలియానా గర్భం దాల్చారన్న విషయం చెప్పలేదు.

    కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ మైఖేల్ ఇందుకు కారణమే వాదన వినిపిస్తోంది. మలయాళ బ్యూటీ పూర్ణ పెళ్ళికి ముందే తల్లైనట్లు సమాచారం. ఎంగేజ్మెంట్ గురించి చెప్పిన పూర్ణ పెళ్లి విషయం దాచారు. దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరిగిందన్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకున్నట్లు సరైన సమాచారం లేదు. గత ఏడాది గర్భం దాల్చిన పూర్ణ ఇటీవల అబ్బాయికి జన్మనిచ్చారు. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీ కారణంగా పూర్ణ తల్లి అయ్యారు.

    స్టార్ లేడీ అలియా భట్ రన్బీర్ కపూర్ తో చాలా కాలం డేటింగ్ చేశారు. దాంతో ఆమె గర్భం దాల్చారు. ఈ విషయం తెలిసి పెళ్లి ప్రకటన చేశారు. 2022 ఏప్రిల్ నెలలో అలియా భట్-రన్బీర్ కపూర్ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన నాలుగు నెలల లోపే అలియా పాపకు జన్మనిచ్చారు. దాంతో అలియా పెళ్లి కాకుండానే తల్లి అయ్యారన్న స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని మీడియా ముందు ఒప్పుకున్న అలియా భట్ అది తప్పే కాదన్నట్లు మాట్లాడారు. తన చర్యను సమర్ధించుకున్నారు.

    Star Heroines

    ఐ, రోబో 2.0 చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అమీ జాక్సన్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చారు.ఈ బ్రిటిష్ నటి వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే పరస్పర అవగాహనతో పిల్లల్ని కన్నారు. తెలుగులో అమీ జాక్సన్ రామ్ చరణ్ కి జంటగా ఎవడు చిత్రంలో నటించారు. అమీ జాక్సన్ కోలీవుడ్ లో అధికంగా చిత్రాలు. ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన కియారా అద్వానీ సైతం హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహానికి ముందే తల్లి అయ్యారనే ప్రచారం జరిగింది. అయితే ఆమె అబార్షన్ చేయించుకున్నారంటూ మరో వాదన తెరపైకి వచ్చింది.