https://oktelugu.com/

Maharastra : 25 మందిని కబళించిన బస్సు.. అర్థరాత్రి అసలు ఏం జరిగింది?

అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సు టైరు పేలిపోయింది. డివైడర్ ఎక్కి బోల్తా పడింది. ఆ సమయంలో ఎగసిపడిన నిప్పులు ఆయిల్ ట్యాంకర్ కు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటపడే మార్గం లేకపోయింది. 25 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 1, 2023 / 04:32 PM IST
    Follow us on

    Maharastra : అది మహారాష్ట్రలోని బుల్దానా సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మార్గమది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రాత్రి 2 గంటల సమయంలో ఓ బస్సు వెళుతోంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఒక కుదుపు. బస్సు ఒక్కసారిగా బోల్తాపడగా.. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలిసేలోగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఏకంగా ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్నారు.

    యావత్మాల్ నుంచి పుణేకు 32 మంది ప్రయాణికులతో బస్సు శుక్రవారం సాయంత్రం బయలుదేరింది. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సు టైరు పేలిపోయింది. డివైడర్ ఎక్కి బోల్తా పడింది. ఆ సమయంలో ఎగసిపడిన నిప్పులు ఆయిల్ ట్యాంకర్ కు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటపడే మార్గం లేకపోయింది. 25 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. అక్కడి మృతదేహాలు పడి ఉన్నతీరు భయంగొల్పుతున్నాయి. కాగా ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడడం విశేషం.

    ఏడుగురు ప్రయాణికులు తీవ్రగాయాలతో బయటపడ్డారు. వారిని బుల్దానా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి వైద్యసేవలందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు బుల్దాన ఎస్పీ తెలిపారు. ప్రధాని నరంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర కుటుంబం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.