https://oktelugu.com/

Mexico : అంత ఎత్తు నుంచి రోప్ వైర్ తెగి కిందపడ్డాడు.. కానీ బతికాడు.. ఆ బాలుడి సాహసం చూడాల్సిందే..

కొంచె దూరం వెళ్లగానే అందరూ బాలుడు చిన్న వయసులోనే పెద్ద సాహనం చేస్తున్నాడని సంబరపడిపోయారు. కానీ ఆ తరువాత పట్టు కోల్పోయిన బుడ్డోడు వెంటనే చేతులు విడిచిపెట్టాడు. దీంతో కింద ఉన్న కొలనులో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ కింద నీళ్లు ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 1, 2023 4:23 pm
    Follow us on

    Mexico : ఈమధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫేమస్ కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో స్థాయికి మంచి సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే కొందరు వ్యక్తులు తాము చేసే సాహాసాలే ఎక్కువ అనుకుంటే.. తమ పిల్లలతో కూడా ప్రయోగాలు చేసి అభాసుపాలవుతున్నారు. తాజాగా ఓ వీడియోను చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఓ వ్యక్తి తనతో పాటు చిన్న పిల్లాడితో జిప్ సాహసం చేయించాడు. అయితే ఆ పిల్లాడు తాడు తెగి కొలనులో పడ్డాడు. దీంతో ఒక్కసారికి షాక్ కు గురయ్యారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందంటే?
    మెక్సికోలో జిప్ లైన్ సాహసం చేయడం చాలా మందికి అలవాటు. రెండు కొండల మధ్య ఒక పెద్ద తాడును ఏర్పాటు చేసి అటూ ఇటూ జిప్ ద్వారా వెళ్తుంటారు. అయితే దీనిపై వెళ్లడానికి పెద్దవాళ్లే భయపడుతూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తి చేయడమే కాకుండా తనతో పాటు ఓ చిన్నపిల్లాడితో చేయించాడు. మెక్సికోలోని మోంటెర్రీలో  40 అడుగుల ఎత్తులో ఉన్న జిప్ లైన్ పై ఈ బాలుడు వెళ్తుంటాడు.
    పార్క్ ఫండిడోరాకి సంబంధించిన అమెజోనియస్ యాత్రలో భాగంగా ఆరేళ్ల బాలుడు ఈ జిప్ లైన్ పై వెళ్తాడు. కొంచె దూరం వెళ్లగానే అందరూ బాలుడు చిన్న వయసులోనే పెద్ద సాహనం చేస్తున్నాడని సంబరపడిపోయారు. కానీ ఆ తరువాత పట్టు కోల్పోయిన బుడ్డోడు వెంటనే చేతులు విడిచిపెట్టాడు. దీంతో కింద ఉన్న కొలనులో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ కింద నీళ్లు ఉండడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు.
    ఈ వీడియోను ట్విట్టర్లో @1Around_thdrorl అకౌంట్లో జూన్ 27న పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ బాలుడి సాహసం మెచ్చుకుంటుండగా..మరికొందరు మాత్రం పక్కనున్న వ్యక్తికి బుద్దిలేదా? అని విమర్శిస్తున్నారు. ఇంత చిన్న పిల్లలతో ఇలాంటి సాహస యాత్రలు ఎందుకు చేస్తారు? అంటూ ఘాటుగా ప్రశ్నలు వేస్తున్నారు.