Homeఎంటర్టైన్మెంట్Ee Nagaraniki Emaindi closing collections : ఈ నగరానికి ఏమైంది' రీ రిలీజ్ క్లోసింగ్ వసూళ్లు..ఈ...

Ee Nagaraniki Emaindi closing collections : ఈ నగరానికి ఏమైంది’ రీ రిలీజ్ క్లోసింగ్ వసూళ్లు..ఈ రికార్డు ని స్టార్ హీరోలు కూడా అందుకోలేరు!

Ee Nagaraniki Emaindi closing collections : ఈ వారం విడుదలైన కొత్త సినిమాలకంటే, పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని కబ్జా చేసేశాయి . పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తొలిప్రేమ’ మరియు ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి.

‘తొలిప్రేమ’ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం లో పెద్ద సర్ప్రైజ్ ఏమి లేదు, ఎందుకంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. కానీ ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం వసూళ్ల సునామి సృష్టించడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. మొదటి రోజు ఈ చిత్రం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన పోకిరి సినిమా రీ రిలీజ్ వసూళ్లనే దాటేసింది. పోకిరి చిత్రాన్ని గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసారు.

ఈ చిత్రానికి అప్పట్లో దాదాపుగా కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం మొదటి రోజు కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా ట్విట్టర్ లో ఒక పోస్టర్ ద్వారా తెలియచేసింది. ఇక రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వసూళ్లు రాకపోయినా కూడా తెలంగాణ లో మాత్రం అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంది.

ఇక వీకెండ్ కూడా ఈ చిత్రం మల్టీప్లెక్సులలో ఆక్యుపెన్సీలు ఇరగదీస్తోంది. మొత్తం మీద ఈ చిత్రానికి క్లోసింగ్ కలెక్షన్స్ రెండు కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కి ఈమధ్య కాలం  విడుదలైన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆలాంటి సమయం లో విడుదలైన ఈ చిత్రానికి మంచి వసూళ్లు రావడం తో చాలా సంతోషం గా ఉన్నాడు సురేష్ బాబు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
Oktelugu Epaper
Exit mobile version