https://oktelugu.com/

ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి సాధారణ రైళ్లు… నిజమేనా..?

గతేడాది కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. కేంద్రం ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరుతో పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. మే నెల నుంచి దశల వారీగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రద్దీ రూట్లలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. Also Read: కల వల్ల కోటీశ్వరురాలైన మహిళ.. ఎలా అంటే..? అయితే దేశంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2021 11:35 am
    Follow us on

    Indian Railways

    గతేడాది కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. కేంద్రం ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల పేరుతో పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. మే నెల నుంచి దశల వారీగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రద్దీ రూట్లలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

    Also Read: కల వల్ల కోటీశ్వరురాలైన మహిళ.. ఎలా అంటే..?

    అయితే దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం దశల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. అయితే పూర్తిస్థాయిలో ప్రయాణికులకు రైళ్లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇదే సమయంలో 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.

    Also Read: ఆ గ్రామంలో పాము కరిచినా చనిపోరట.. ఎక్కడంటే..?

    చాలామంది రైలు ప్రయాణికులు ఆ మెసేజ్ నిజమేనని నమ్ముతున్నారు. రెగ్యులర్, లోకల్, ప్యాసింజర్ రైళ్లను కేంద్రం పట్టాలెక్కిస్తుందని భావిస్తున్నారు. అయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వైరల్ అవుతున్న మెసేజ్ పై స్పందించి స్పష్టతనిచ్చింది. వైరల్ అవుతున్న మెసేజ్ లో ఏ మాత్రం నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఎవరో ట్వీట్ ను మార్ఫింగ్ చేసి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

    మరిన్ని వార్తల కోసం: వైరల్

    రైల్వేశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన తరువాతే సాధారణ రైళ్ల పున: ప్రారంభం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో ప్రయాణికులకు రైళ్లు అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని చెప్పవచ్చు.