https://oktelugu.com/

విడుదల కాకుండానే మహేష్ సినిమా వరల్డ్ రికార్డ్

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గత సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో హిట్ అందుకోవటంతో వరుసగా హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలకు సంబంధించిన వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందబోతుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక సరికొత్త రికార్డు నమోదు కావటం తెలుగు రాష్ట్రాలలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2021 / 01:37 PM IST
    Follow us on


    టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గత సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో హిట్ అందుకోవటంతో వరుసగా హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలకు సంబంధించిన వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందబోతుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక సరికొత్త రికార్డు నమోదు కావటం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: ‘సర్కారు వారి పాట’ మొదలైపోయింది !

    ఈ మధ్యన అభిమానులు తమ అభిమాన హీరోకి సంబంధించిన ఏదైనా విశేషం జరిగినా, జరగబోతున్నా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ అభిమానులు ట్విట్టర్ లో ” #SarkaruVaariPaata ” అనే హ్యాష్ ట్యాగ్‌ తో వరుస ట్వీట్స్ చేస్తుండటంతో ఈ సినిమా నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. రికార్డు రేంజ్ లో వంద మిలియన్స్ ట్విట్స్ అందుకుంది ఈ హ్యాష్ ట్యాగ్. ఇంతముందు ఇలాంటి ఫీట్ ఎవరు సాధించలేదు. అసలు సినిమా విడుదలవకముందే ఇలాంటి సంచలనం సృష్టిస్తే ఇక విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ నమోదవుతాయో అని ఇండస్ట్రీ వర్గాలు లెక్కలేస్తున్నారు.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు కొత్త అప్ డేట్స్ !

    ఇక సినిమా విషయానికొస్తే… ఈ రోజు నుండి దుబాయ్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి కూడా పాల్గొంటుంది. తమన్ మరోసారి మహేష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్