https://oktelugu.com/

రాముడికి ఉడతా భక్తి.. మందిరం నిర్మాణానికి పారిశ్రామికవేత్తల భారీ విరాళాలు

ఉత్తర ప్రదేశ్ లోని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి విరాళలు వెల్లువెత్తున్నాయి. గల్లీనుంచి ఢిల్లీ వరకు… పేదవాడి నుంచి పారిశ్రామికవేత్త వరకు తోచినకాడికి ఉడతా భక్తిగా చందాలు రాస్తున్నారు. రూ.100 నుంచి కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఈ విరాళాల విషయం ఇప్పటికే వివాదంగా మారిన విషయం తెలిసిందే.. పలువురు టీఆర్ఎస్ నేతలు విరాళాలు ఇవ్వొద్దని సంచలన ప్రకటనలు చేయగా.. బీజేపీ వాళ్లు వారికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.. Also Read: నాసిక్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 1:54 pm
    Follow us on

    Ayodhya-Ram-Mandir-Donations
    ఉత్తర ప్రదేశ్ లోని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి విరాళలు వెల్లువెత్తున్నాయి. గల్లీనుంచి ఢిల్లీ వరకు… పేదవాడి నుంచి పారిశ్రామికవేత్త వరకు తోచినకాడికి ఉడతా భక్తిగా చందాలు రాస్తున్నారు. రూ.100 నుంచి కోట్లల్లో విరాళాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఈ విరాళాల విషయం ఇప్పటికే వివాదంగా మారిన విషయం తెలిసిందే.. పలువురు టీఆర్ఎస్ నేతలు విరాళాలు ఇవ్వొద్దని సంచలన ప్రకటనలు చేయగా.. బీజేపీ వాళ్లు వారికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..

    Also Read: నాసిక్ టు ముంబయి.. సాగు చట్టాలపై కదం తొక్కిన మహారాష్ర్ట రైతులు

    ఈ క్రమంలో కొందరు పారిశ్రామిక వేత్తలు రామ మందిరం నిర్మాణానికి రూ.కోట్లలో విరాళాలు రాస్తున్నారు. మైహోం గ్రూప్ రూ.5కోట్లు.. మేఘా గ్రూప్ రూ.6 కోట్లు.. గోకరాజు.. గంగరాజు గ్రూప్ రూ.5కోట్లు.. రాంకీ గ్రూప్ అధినేత అయోధ్య రామిరెడ్డి.. రూ.5కోట్లు.. సుజనా చౌదరి రూ.2.20 కోట్లు.. ఇలా ప్రవాహంగా విరాళాలు సాగిపోతూనే ఉన్నాయి. దేశంలోని కార్పొరేట్ కంపెనీల సంగతి ఏమోకానీ.. రాష్ర్టంలో పారిశ్రామిక వేత్తలు మాత్రం అయోధ్య రామయ్యకు రూ. కోట్లలో విరాళాలు సమర్పించుకుంటూ.. ఉడతా భక్తిని ప్రదర్శిస్తున్నారు.

    Also Read: మోడీ సార్ ‘పెట్రో’ మంట.. ఆల్ టైం అత్యధికానికి చేరిక

    ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం ఉన్న పారిశ్రామికవేత్తలు.. రాముడిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. తమ స్థోమతకు తగినట్లుగా… రూ. కోట్లలోనే చెల్లింపులు చేస్తున్నారు. అయోధ్య రామయ్యకు విరాళాలు ఇచ్చే విషయంలో ఏ ఒక్కనేత సైతం పార్టీబేధాలు చూపడం లేదు. ఈ మొత్తం విరాళాల సేకరణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. అదేదో తమ సొంతపార్టీ వ్యవహారం అన్న విధంగా కాషాయం నేతల హడావుడి అంతా ఇంతాకాదు. అయినప్పటికీ.. ఇతర పార్టీల నేతలు మరో విధంగా భావించకుండా రాముడికి భక్తిపూర్వకంగా ఎంతో కొంత సమర్పించుకుంటున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    పారిశ్రామికవేత్తలైన బీజేపీ నేతలు సైతం భారీ మొత్తంగా విరాళాలు అందిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు అయిన వివేక్, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తలా రూ.కోటి విరాళంగా అందించారు. పారిశ్రామిక వేత్తలు అత్యధికంగా రూ.కోటికిపైగానే విరాళాలు రాస్తున్నారు. అయోధ్య రామయ్య గుడి నిర్మాణానికి రూ.11వందల కోట్లు ఖర్చు అవుతుందని ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా ఉచితంగా సర్వే నిర్వహించడానికి ప్రయివేటు సంస్థలు ముందుకు వచ్చాయి. ఆలయ నిర్మాణంలో ప్రతీ భారతీయుడికి భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరించే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే దాదాపు వంద నుంచి రెండు వందల కోట్లు రాముడి ఆలయ నిర్మాణానికి నిధులు సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బీజేపీ నాయకులు.