Pawan Kalyan On Unstoppable: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రేపు రాత్రి 9 గంటలకు ఆహా స్ట్రీమింగ్ కాబోతుంది..ఈ ఎపిసోడ్ ని ఆహా టీం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..ఈ ఎపిసోడ్ తోనే రెండవ సీజన్ ముగియబోతుంది..రేపు మూడు గంటలకు అల్లు అరవింద్ మరియు ఆహా టీం ఈ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది అని ప్రకటించిన తర్వాతి నుండి నేటి వరకు పెరిగిన ఆహా మీడియా వినియోగదారుల సంఖ్య గురించి..అలాగే ఓటీటీ హిస్టరీ లో ఈ ఎపిసోడ్ ఎలాంటి చరిత్ర తిరగరాయబోతుంది అనేది చెప్పబోతున్నారట..అంతే కాకుండా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ మూడవ సీజన్ గురించి కూడా వివరాలు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Also Read: Hari Hara Veera Mallu: బ్రేకింగ్ : రెండు భాగాలుగా రాబోతున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’
అయితే ఓటీటీ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డుని నెలకొల్పేందుకు పూనుకున్నారు..ఒక్కరోజులో ఒక లక్ష సబ్ స్క్రిప్షన్స్ తో పాటుగా 15 కోట్ల రూపాయిల వరకు రెవిన్యూ ని కేవలం మొదటి రోజే వచ్చే లాగ సన్నాహాలు చేస్తున్నారట..అదే కనుక జరిగితే నేషనల్ ఓటీటీ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు గా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు.

ప్రభాస్ ఎపిసోడ్ అప్లోడ్ చెయ్యగానే ఆహా మీడియా సర్వర్లు బ్లాస్ట్ అయ్యి యాప్ క్రాష్ అయ్యింది..దాంతో సరికొత్త టెక్నాలజీ తో సర్వర్స్ కెపాసిటీ ని బాగా పెంచారు..అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తాకిడికి ఆ సర్వర్ కెపాసిటీ అయినా సరిపోతుందో లేదో అని ఆహా టీం కంగారు పడుతుంది..చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ తో ఎలాంటి రికార్డుని నెలకొల్పబోతున్నారో అనేది.
