Puri Jagannadh: తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి కమర్షియల్ సినిమాని ఇలా కూడా తియ్యొచ్చా అని అనిపించేలా చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్..పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పూరి జగన్నాథ్ హీరోయిజం కి సరికొత్త నిర్వచనం నేర్పించాడు..ఆ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి ఎదో కొత్త రకం సినిమాని చూసిన అనుభూతి కలిగింది ఆ రోజుల్లో..ఆ తర్వాత పూరి జగన్నాథ్ హీరోలు అంటే మార్కెట్ లో తెగ క్రేజ్ ఏర్పడింది.
హీరోల పాత్రలను ఆయన మలిచే తీరు అంత అద్భుతంగా ఉంటుంది మరి..ముఖ్యంగా బద్రి , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి , దేశముదురు , చిరుత ఇలా ఒక్కటా రెండా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి..అంతే కాదు తనకంటూ హీరో తో సరిసమానమైన మాస్ ఇమేజి ని మరియు బ్రాండ్ వేల్యూ ని సంపాదించుకున్నాడు..కానీ ఎంతటి వాడికైనా పరాజయాలు తప్పవు.
పూరి జగన్నాథ్ విషయం లో అదే జరిగింది..టెంపర్ సినిమా తర్వాత సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్, మొత్తానికి హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు..పూరి జగన్నాథ్ టైం మళ్ళీ మొదలైంది అంటూ ఆయన అభిమానులు మురిసిపోయారు..కానీ అదంతా మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది..ఈ సినిమా తర్వాత ఆయన భారీ బడ్జెట్ తో విజయ్ దేవరకొండ ని హీరో గా పెట్టి ‘లైగర్’ అనే సినిమా తీసాడు..ఇది పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
దీనితో పూరి జగన్నాథ్ పూర్తి గా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు..ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లోనే విజయ్ దేవరకొండ తో ‘జన గణ మన’ అనే సినిమా కూడా కమిట్ అయ్యాడు..కానీ లైగర్ ఫలితం చూసి విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ నుండి మెల్లగా తప్పుకున్నాడు.
ఇక వేరే హీరోలెవ్వరూ కూడా పూరి జగన్నాథ్ కాల్స్ కూడా లిఫ్ట్ చెయ్యడం లేదట..కానీ పెద్ద మనసు చేసుకొని మెగాస్టార్ చిరంజీవి పూరి తో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు..ఇటీవలే కలిసి ఆయనకీ స్టోరీ మొత్తాన్ని వినిపించగా మెగాస్టార్ కి పెద్ద నచ్చలేదని తెలుస్తుంది..దీనితో ఈ ప్రాజెక్ట్ కూడా అట్టకెక్కినట్టే..అలా ఇండస్ట్రీ లో నెంబర్ 1 కమర్షియల్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడే స్థాయి వచేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.