Kushi Re Release Box Office Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ ని ఇటీవలే డిసెంబర్ 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే..మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి..కొత్త సినిమా విడుదల లెక్క ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోయాయి..కేవలం 31 వ తేదీన ఈ సినిమాకి దాదాపుగా నాలుగు కోట్ల 30 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

పుట్టినరోజు నాడు విడుదల కాదు కాబట్టి జల్సా స్పెషల్ షోస్ గ్రాస్ రికార్డు ని బద్దలు కొట్టడం కష్టమేమో అని అందరూ అనుకున్నారు..కానీ ఖుషి చిత్రం జల్సా రికార్డు ని కోటి రూపాయిల గ్రాస్ మార్జిన్ తో లేపడం పెద్ద సెన్సేషన్ అయ్యింది..కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, రెండవ రోజు కూడా ఈ చిత్రం అద్భుతాలు సృష్టించింది..సుమారుగా కోటి 60 లక్షల రూపాయిలు వసూలు చేసి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.
కేవలం రెండు రోజులతో ఈ చిత్రం రన్ ఆగిపోలేదు..మూడవ రోజు కూడా మేజర్ సిటీస్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసింది..మూడవ రోజు ఈ చిత్రానికి ఏకంగా 68 లక్షల రూపాయిలు వచ్చాయి..నాల్గవ రోజు సుమారుగా 30 లక్షలు వచ్చాయి..అలా నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 7 కోట్ల రూపాయిలు వచ్చి ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మొత్తం మీద ఫుల్ రన్ లో కచ్చితంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు..అదే కనుక జరిగితే ఖుషి రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప ఇండియా లో ఏ హీరో కూడా బ్రేక్ చేయలేడని చెప్పొచ్చు..రీ రిలీజ్ లో ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు..ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి నిదర్శనం లాంటిదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.