Lions vs hyenas : సింహం అంటే అడవికి రాజు. సింహానికి ఆకలేస్తే అడవి కూడా పస్తులు ఉంటుంది. అదే సింహం వేటాడితే అడవి కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.. అలాంటి సింహాలకు ఎదురొచ్చిన ఏ జంతువూ బతికి బట్ట కట్టదు. సింహానికి ఆకలేసినప్పుడు కనిపించిన ఏ జంతువుకూ భూమ్మీద నూకలు ఉండవు. అందుకే సింహాన్ని మృగరాజు అని పిలుస్తారు. అలాంటి సింహం ఏదైనా జంతువును మాట్లాడితే.. అది తినగా మిగిలిన మాంసాన్ని హైనాలు, రాబందులు నెలల పాటు తింటాయి. అయితే మనలో చాలామంది సింహాలకు అడవిలో ఎదురేలేదని అనుకుంటాం. సింహం ఏది చెబితే అదే శాసనం అని భావిస్తాం. కానీ అది తప్పు. అడవిలో సింహానికి ఎదురు వెళ్ళే జంతువులు ఉంటాయి. సింహాన్ని వేటాడితినే జంతువులు కూడా ఉంటాయి.
దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందిన ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో సింహాన్ని హైనాలు చుట్టుముట్టాయి. ముకుమ్మడిగా దాడి చేశాయి. కొన్నయితే దాని శరీరాన్ని చీల్చాయి. దీంతో ఆ సింహం ఆర్తనాదాలు చేసింది. హైనాలు దాడి చేస్తుంటే తట్టుకోలేక ఇబ్బంది పడిపోయింది. ఇక కొంతసేపయితే సింహం ప్రాణం పోతుందనగా తోటి సింహాలు అక్కడికి వచ్చాయి. అయినాల మీద విరుచుకుపడ్డాయి. దీంతో హైనాలు వెనక్కి వెళ్ళాయి.
అంతే మరిన్ని హైనాలు జతకలిసి సింహాల మీదికి వెళ్లాయి. ఆ సింహాలు కూడా తగ్గేది లేదన్నట్టుగా ముందుకు వచ్చాయి. అయితే హైనాలు మిడతల దండు లాగా ఒక్కసారిగా సింహాల మీద పడ్డాయి. దీంతో సింహాలు కొంతసేపు ప్రతిఘటించి తిరిగి వెళ్ళిపోయాయి. ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో nature is amazing అనే ఐడీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల వ్యూస్ నమోదు చేసుకుంది. ” సింహాలు బలమైన జంతువు అనుకుంటాం కానీ.. హైనాల కుట్రల ముందు వాటి బలం సరిపోలేదు. అందుకే వాటికి తలవంచాయి” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Lioness being attacked by a hyena clan is rescued by her pride. pic.twitter.com/ODvOs3ruW3
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 31, 2024