Sachin Tendulkar- Lionel Messi: సచిన్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో ఒక దిగ్గజం. సెంచరీలను అలుపు అన్నదే లేకుండా కొట్టిన మేటి బ్యాట్స్ మెన్.. కోట్లాదిమంది ప్రేక్షకులకు ఆరాధ్యమైన క్రికెటర్.. క్రికెట్ చరిత్రలోనే ఆల్ టైం గ్రేట్ క్రికెటర్. 2011లో భారత్ లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ విజయంతో తన కెరియర్ ను పరిపూర్ణం చేసుకున్నాడు.. దీంతో అతడికి ఘనమైన వీడ్కోలు లభించినట్లు అయింది. అలాగే సమకాలీన ఫుట్ బాల్ చరిత్రలో మెస్సీ గ్రేట్ ప్లేయర్. ఖతార్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ఓడించి తన జట్టు 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ లో మూడు గోల్స్ సాధించాడు. ఓవరాల్ గా ప్రపంచ కప్ లో అతడికి ఇది 13వ గోల్. ఈ క్రమంలో పీలే(12) రికార్డును దాటేశాడు..16 గోల్స్ తో మిరోస్లోవ్ క్లోజ్( ఇటలీ), 15 గోల్స్ తో రొనాల్డో ( బ్రెజిల్) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇద్దరికీ పోలికలు ఇలా
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు సచిన్, ఫుట్ బాల్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరు మెస్సీ. అయితే వీరిద్దరి ప్రపంచకప్ విజయాల్లో పోలికలు ఉన్నాయి. క్రికెట్లో సచిన్ పదో నెంబర్ జెర్సీ ధరించేవాడు..ఫుట్ బాల్ లో కూడా మెస్సీ అదే నెంబర్ జెర్సీ వేసుకుంటాడు.. 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమితో సచిన్ టెండుల్కర్ నిరాశ చెందాడు.. 8 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ అందుకున్నాడు. తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలికాడు.. అలాగే 2014లో ఫైనల్ లో రన్నరప్ తో మాత్రమే మెస్సీ సరి పెట్టుకున్నాడు.. ఎనిమిది సంవత్సరాల తర్వాత కప్ సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచ కప్ సెమిస్ లో సచిన్ టెండుల్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.. 2022 ప్రపంచ కప్ లోనూ మెస్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వేరువేరు క్రీడల్లో అత్యుత్తమ ఆటగాళ్ళుగా పేరున్న ఇద్దరు మధ్య ఇలాంటి పోలికలు ఉండటం విశేషమే. ఇందులో మెస్సీ తీరును సచిన్, సచిన్ ఆట తీరును మెస్సీ ఇష్టపడతారు.

వయసులోనూ..
కెరియర్ ముగింపుకు వచ్చిన వేళ సచిన్ టెండూల్కర్ మూడు పదులను దాటేశాడు. కానీ తన ఆట తీరుతో వయస్సును తొక్కి పడేశాడు. యువకులతో సమానంగా పరుగులు తీశాడు. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక మెస్సి వయసు కూడా 37 ఏళ్లు.. వాస్తవానికి ఫుట్ బాల్ కప్ చరిత్రలో ఒక ఆటగాడు వయసు పెరుగుతున్నా ఈ స్థాయిలో రాణించడం గొప్ప విషయం.. మెస్సీ ఈ టోర్నీలో గోల్డెన్ బాల్ పురస్కారం దక్కించుకున్నాడు అంటే అతని ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇలా ఎంత చెప్పినా పోలికలు కనిపిస్తూనే ఉంటాయి. సచిన్, మెస్సీ సమకాలీన క్రీడా ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు. ఎందుకంటే వారు నెలకొల్పిన రికార్డులు అటువంటివి. ఇవి ఇప్పట్లో చెరిగి పోయేవి కావు.