Uday Kiran: సినిమా రంగంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. దానికి మనకు సంబంధించిన వారు ఎవరైనా ఉండాలి. లేదంటే మన టాలెంట్ జత కావాలి. అలా ప్రతిభతో పైకి వచ్చిన వారు కూడా కొందరున్నారు. అందులో ఉదయ్ కిరణ్ ఒకరు. ఎలాంటి బ్యాక్ సపోర్టు లేకుండానే 2000 సంవత్సరంలో చిత్రం సినిమాతో రంగప్రవేశం చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఎంత స్పీడుగా అంతే స్పీడుతో పతనం అయ్యారు. సినిమాల్లో అవకాశాల్లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తన కెరీర్ నాశనం కావడానికి పరోక్షంగా కొందరు కారణమనే వాదనలు కూడా వచ్చాయి. లవర్ బాయ్ గా పిలిపించుకున్న ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులను ఎంతగానో కలచివేసింది.

ఉదయ్ కిరణ్ కు అదృష్టం మొదట కలిసొచ్చినా తరువాత అంత అడ్డం తిరిగింది. సినిమాలు కనీసం ఆడకుండా పోవడంతో నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించారు. అప్పటికే ప్లాపులతో కొట్టుమిట్లాడుతున్న ఆయనకు తరువాత ఓ ఐదు సినిమాలు అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సినిమా నిపుణులు చెబుతున్నారు. తన కెరీర్ ను చక్కదిద్దుకునే క్రమంలో ఎలాంటి ఆశలు లేకపోవడంతోనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అంతా అనుకున్నారు. సినిమాలే జీవితంగా ముందుకు సాగిన ఉదయ్ కిరణ్ కు అంతటి దుస్థితి కగలడంతో మనసు వికటించి ఆత్మహత్య వైపు మారాడు.
పెళ్లి కూడా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి వరకు మంచి దూకుడు మీదున్న అతడు ఒక్కసారిగా కిందికి జారిపోయాడు. ఉదయ్ కిరణ్ హీరోగా సినిమాలు మొదలైనా అవి చివరి వరకు నిలబడలేదు. ప్రఖ్యాత నిర్మాత ఏఎం రత్నం సినిమాలంటే ఎంతో గురి ఉండేది ప్రేక్షకులకు. ఆయన నిర్మాతగా ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే ప్రాజెక్టు ప్రారంభించినా నలభై శాతం పూర్తయ్యే సరికి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఉదయ్ కిరణ్ కు ఏం తోచలేదు. అంత పెద్ద సంస్థ సినిమా కావడంతో అందరికి ఎంతో ఆసక్తి కలిగింది. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఏం చేయాలో తోచలేదు.
ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్, అంకితలతో ఓ సినిమా మొదలైనా అది కూడా ముందుకు సాగలేదు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాలనుకున్నా అది కూడా నెరవేరలేదు. ఇంకా బాలకృష్ణ, సౌందర్య హీరోహీరోయిన్లుగా నర్తనశాల అనే సినిమా తీయాలని అనుకున్నారు. ఇందులో అభిమన్యుడి పాత్రకు ఉదయ్ కిరణ్ ను అనుకున్నారు. ఆ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదయ్ కిరణ్, త్రిషతో జెట్ వి మెట్ అనే సినిమా చేయాలనుకున్నారు. అది కూడా ఫలించలేదు.

సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై వారు లవర్స్ అనే సినిమా ఉదయ్ కిరణ్, సదాలతో చేయాలనుకున్నా అది కూడా క్యాన్సిల్ అయ్యింది. ఆదిశంకరాచార్య సినిమా కూడా ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నా సాధ్యం కాలేదు. ప్రఖ్యాత నిర్మాత ఎంఎస్ రాజు ఉదయ్ కిరణ్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. అది కూడా పట్టాలెక్కలేదు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నా వీలు కాలేదు. ఉదయ్ కిరణ్ ను పరిచయం చేసిన దర్శకుడు తేజ కూడా మరో సినిమా చేయాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ముందుకు పోలేదు. ఇలా ఉదయ్ కిరణ్ కు దురదృష్టం వెంటాడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని పలువురి వాదన.