Homeట్రెండింగ్ న్యూస్Youtuber Gaurav: యూట్యూబ్‌ వీడియోలు చేసి రూ.400 కోట్లు సంపాదన.. ఆ సీక్రెట్ ఇదే

Youtuber Gaurav: యూట్యూబ్‌ వీడియోలు చేసి రూ.400 కోట్లు సంపాదన.. ఆ సీక్రెట్ ఇదే

Youtuber Gaurav: వందల కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌.. ఖరీదైన ఇల్లు.. ఇంటి ఆవరణలో బెంజ్, రోల్స్‌ రాయిస్, రేంజ్‌రోవర్‌ కార్లు. ఇంట్లో అందరికీ బంగారం. ఐఫోన్‌. చదువుతుంటే.. ఇంత విలాసవంతమైన జీవితం అనిపిస్తుంది కదూ. అవును విలాసవంతమైనదే. ఇందుకు కేవలం యూట్యూబ్‌ వీడియోలు చేస్తే సరిపోతుంది అంటున్నాడు గౌరవ్‌ చౌధురి. ఒకప్పుడు పేద కుటుంబంలో పుట్టి.. ఇప్పుడు అత్యంత సప్పన్నుడిగా ఎదిగాడు. రెండున్నర కోట్ల మందికి నెట్‌లో టెక్‌ పాఠాలు బోధిస్తూ ఏకంగా రూ.400 కోట్లు సంపాదించాడు.

లక్ష్యంపై గురి ఉంటే..
గుండెల నిండా ధైర్యం.. లక్ష్యంపై గురి ఉంటే.. ధనిక, పేద తేడా లేకుండా ఎవరైనా గెలుపు జెండా ఎగరవేయొచ్చని రిరూపించాడు ఈ టెక్‌ గురు గౌరవ్‌ చౌధురి. రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఓ చిన్న రేకుల షెడ్డులో ఉంటూ వీధి చిరవరణ కిరాణా షాపు నడిపేవాడు గౌరవ్‌ తండ్రి. అతని బంధువలు ఖరీదైన కార్లలో తిరిగేవారు. గౌరవ్‌ వాళ్లను చూసి మనం ఎందుకు వాళ్లలా లేమని అడిగేవాడు. క్రమంగా డబ్బే అంతరానికి కారణం అని తెలుసుకున్నాడు. అంతరాన్ని బ్రేక్‌ చేయాలంటే.. రెండు చేతులా డబ్బులు సంపాదించాలని చిన్నవయసులోనే నిర్ణయించుకున్నాడు. మరోవైపు కిరాణాషాపుపై వచ్చే డబ్బులు చాలక గౌరవ్‌ తండ్రి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. తల్లితో కలిసి కిరాణం నడుపుతూ స్కూల్‌కు వెళ్లిన గౌరవ్‌ ఇంటర్‌ వచ్చే సరికి స్నేహితులతో టెక్నాలజీ మీద ఆసక్తి కలిగింది. దీంతో క్లాసులకు డుమ్మా కొట్టి.. కోడింగ్‌ నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు మందలించినా పట్టించుకోలేదు. ఆ సమయంలో కోడింగ్‌ గురించి అమ్మానాన్నలకు చెప్పినా అర్థం చేసుకోరని తెలుసుకున్నాడు.

బిట్స్‌ పిలానీలో సీటు..
గౌరవ్‌ ఆసక్తిని లెక్చరర్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్స్‌ చదువకోవాలని ప్రోత్సహించారు. అతని తండ్రి మాత్రం ఇంటర్‌ అయ్యేక ఏదో ఒక ఉద్యోగంలో పెట్టొచ్చని కొడుకును దుబాయ్‌ తీసుకెళ్లాడు. అక్కడ పని చేయడానికి ఇష్టపడని గౌరవ్‌ చదువు మీద దృష్టిపెట్టి బిట్స్‌ పిలానీలో మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో సీటు సంపాదించి దుబాయ్‌ క్యాంపస్‌లో చేరాడు. ఆ సమయంలో గౌరవ్‌కి లెక్చరర్లు, స్నేహితులు ఆర్థికంగా సాయం చేశారు. దానికితోడు పార్ట్‌టౌం జాబ్‌ చేసి ఫీజులు కట్టేవాడు.

యూట్యూబ్‌లో చూసి అనుమానాల నివృత్తి..
2012లో చదువు పూర్తిచేసి కొంతకాలం దుబాయ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో సర్టిఫైడ్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌ సర్వీస్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తనకొచ్చిన రకరకాల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి య్యూట్బూలో వీడియోలు చూసేవాడు. మూడేళ్లు పనిచేసి అప్పులన్నీ తీర్చాక 2015లో ఉద్యోగం మానేశాడు. తర్వాత ‘టెక్నికల్‌ గురూజీ’ పూరిట యూట్యూబ్‌ ప్రారంభించాడు. దాని ద్వారా మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కార్ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అర్థం కాని సాంకేతిక విషయాలను సైతం సింపుల్‌ హిందీలో వివరించడం అతని ప్రత్యేకత. కొత్తగా వచ్చే ఫోన్లు, వాటి ప్రత్యేకతలు, బ్యాంకింగ్‌ మోసాలు, డిజిటల్‌ స్కామలు వంటి వాటి గురించి కూడా గౌరవ్‌ చెప్పే విషయాలు సామాన్యులకు చక్కగా అర్థం కావడంతో ఫాలోవర్లు సబ్‌స్క్రైబర్లు పెరిగారు. చానెల్‌కు ఆదరణ పెరిగి ఆదాయం కూడా పెరిగింది.

దేశంలో టాప్‌..
ప్రస్తుతం రెండున్న కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న గౌరవ్‌ యూట్యబ్‌ చానెల్‌ టెక్నికల్‌ గురూజీ దేశంలోనే అత్యధిక మంది చందాదారులు ఉన్న టెక్‌ యూట్యూబర్‌గా నిలిచాడు. రోజూ ఏదో ఒక వీడియో పోస్టు చేస్తుంటాడు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ప్రతీ ఆదివారం వివరిస్తాడు. యూట్యూబ్‌ ద్వారా ఇప్పటికే దాదాపు రూ.400 కోట్లు సంపాదించాడు. ప్రతీనెల రూ.కోటి ఆదాయం పొందుతున్నాడు. చిన్నతనంలో తమకు ఏమేమి లేవని ఫీలయ్యాడో అవన్నీ సమకూర్చుకుంటున్నాడు. ఢిల్లీ, ముంబైలో ఖరీదైన ఇళ్లు కట్టుకున్నాడు. ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. ఫోన్లు కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు.

పలు సంస్థల గుర్తింపు..
గౌరవ్‌కు ఆదరణ పెరగడంతో వన్‌ప్లస్, శామ్‌సంగ్, గూగుల్‌ సంస్థలు సైతం గౌరవ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ టెక్నాలజీ వివరాలను అతనితో పంచుకున్నాయి. తమ ఆఫీసుల్లో వీడియో చేసుకోవడానికి అనుమతి ఇచ్చాయి. యాపిల్‌సీఈవో టిమ్‌ కుక్‌ను కలవాలని కలగనేవారు ఎందరో ఉంటారు. కానీ, గౌరవ్‌ వీడియోలు చేసిన టిమ్‌ ఈ గతేడాది ముంబైలో ప్రారంభించిన స్టోర్‌కు ఆహ్వానించాడు. కలలు కనండి.. వాటిని నెరవేర్చుకోండి అన్న కలాం నినాదాన్ని గౌరవ్‌ నిజం చేసి చూపించాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular