Ukraine Crisis : యుద్ధం చేయడమంటే ఒక దశాబ్ధం పాటు జీవితాలను ఫణంగా పెట్టడమే..యుద్ధం గీసే కన్నీటిరాతలు అన్నీ ఇన్నీ కావు..యుద్ధం అంటేనే ఒక విషాదం.. ప్రజలు వలస పోవడాలు.. సైనికులు యుద్ధం కోసం వెళ్లి మరణించడాలు.. ఇలా ఒక్కటేమిటీ..యుద్ధం అంటేనే ఒక తరానికి ఇబ్బందులు..అలాంటికన్నీటి సంద్రాన్ని మూటగట్టుకుంది ఇప్పుడు ‘ఉక్రెయిన్’

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధం సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సైనికులు నెలలుగా రష్యాతో పోరాడుతున్నారు. ఈ ఫైట్ ఇప్పటికీ సాగుతోంది. పెళ్లాం బిడ్డలను వదిలి ఉక్రెయిన్ సైనికులు యుద్ధం చేస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా యుద్ధం తీవ్రత తగ్గింది. రష్యా సైన్యం పలుచబడింది. యుద్ధం అంత తీవ్రస్థాయిలో జరగడం లేదు. ఈ క్రమంలోనే ఓ ఉక్రెయిన్ సైనికుడు తన కుటుంబాన్ని కలవడం కోసం ఇంటికి వచ్చాడు. తండ్రి కోసం ఎదురుచూస్తున్న కూతురు బయట ఉంటే కళ్లకు గంతలు కట్టి ఆ తల్లి తీసుకొచ్చింది.
యుద్ధ రంగం నుంచి వచ్చిన తండ్రిని చూసి గట్టిగా హత్తుకొని ఆ కూతురు కన్నీళ్లు కార్చింది. ఆనందభాష్పాలతో డాడీని పట్టుకొని ఏడ్చేసింది. ఈ వీడియో ప్రతీ ఒక్కరిని కదిలించేస్తోంది. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రతినిధి షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
యుద్ధంతో ఉక్రెయిన్ కుటుంబాలు ఎంతగా మథనపడుతున్నాయన్న దానికి ఈ కన్నీటి వీడియో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. తండ్రిని యుద్ధరంగానికి పంపి ఆ కూతురు పడిన ఆవేదన కళ్లకు కడుతోంది.
Daddy came home from war – 2. pic.twitter.com/iOZORtnUSL
— Anton Gerashchenko (@Gerashchenko_en) July 9, 2022