Rain Of Animals : దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు యాక్టింగ్ గా ఉండడం.. పైగా ఇప్పుడు ఉపరితర ద్రోణి ఆవహించింది.దీంతో ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు అని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించేసింది.

ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కొమురంభీం, భూపాలపల్లి, నిర్మల్, జగిత్యాల లాంటి జిల్లాలో భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలో చేపల వర్షం కురిసింది. చేపలతోపాటు పలు రకాల జీవులు రోడ్లు, ఇళ్ల పడడంతో ‘జంతువుల’ వర్షంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
తెలంగాణలోని జగిత్యాలలో అరుదైన ‘జంతువుల వర్షం కురిసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలోని జగిత్యాల పట్టణ వాసులు ఆకాశం నుంచి చేపల వర్షం కురియగా.. ఈ అరుదైన వాతావరణాన్ని కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. కొందరు దీన్ని వీడియో కూడా తీశారు..
ఇక దీన్ని చేపల వర్షం అనకుండా ‘జంతువుల వర్షం’ అని ఎందుకు అంటున్నారంటే.. ఇతర జీవులు కూడా ఆకాశం నుంచి పడ్డాయి. కప్పలు, పీతలు మరియు చేపలు వంటి చిన్న నీటి జంతువులు కూడా జగిత్యాలలో పడ్డాయి. తుఫాన్ లు వచ్చినప్పుడు సముద్రం నుంచి నీరు అంతా సుడులు తిరుగుతూ పైకి లేస్తుంది. అదే వర్షంగా పడుతుంది. సముద్రం నుంచి పైకి లేచినప్పుడు అందులోని చేపలు, రొయ్యలు, కప్పలు, పీతలు ఆకాశంలోకి వెళతాయి. భూమి ఉపరితలంపై సంభవించే వాటర్‌స్పౌట్‌లు లేదా డ్రాఫ్ట్‌లలో ఇలా పైకి కొట్టుకుపోయినప్పుడు వర్షాలు కురుస్తే అవి పడిపోతాయి.
తాజాగా జగిత్యాలలో ఇదే సంభవించింది. సముద్రంలోంచి పైకి లేచిన జంతువులన్నీ వర్షం రూపంలో పడ్డాయి. అవి వర్షం కురిసిన సమయంలోనే కురుస్తాయి. జగిత్యాలలో పడిన చేపలు, పీతలను ప్రజలు పట్టుకొని వండుకొని తిన్నారు. వర్షాల పూట పడిన వీటిని ఎంజాయ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Residents of Jagtial town in #Telangana witnessed a rare weather phenomenon as fish ‘rain’ from the sky. The phenomenon, known as 'animal rain',
happens when small water animals such as frogs, crabs or small fish are swept into water spouts. #Telanganafloods pic.twitter.com/JN9P1fzG5C— Ashish (@KP_Aashish) July 10, 2022