Janasena Janavani: గత కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేసింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కట్టుకునేందుకు రుణం మంజూరు చేసింది. కానీ జగన్ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు ఆ భూమిని లాక్కోవాలని చస్తున్నారు. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోంచి బాధితులను వెళ్లగొట్టారు. ’’ ఇప్పుడు ఆ ఇంట్లోంచి వెళ్లగొట్టిన బాధితులే విజయవాడలో పవన్ కళ్యాణ్ రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు ఆవేదనతో ఏడుస్తూ ఫిర్యాదు చేశారు.

పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఏం చేస్తున్నారో.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా నా దృష్టికి వచ్చాయిన పవన్ కళ్యాన్ ఆరోపించారు. ఇలాంటి సమస్యలే ముందుగా తనను కదిలించాయని పవన్ ఎమోషనల్ అయ్యారు.
అధికారమదంతో కొట్టుకుంటున్న వైసీపీ నేతలంటేనే తనకు చిరాకు అని.. ఒక నాయకుడు కబ్జాలు చేసి లంచాలు తీసుకుంటే భరించగలమని.. కానీ గ్రామస్థాయి నాయకుల వరకూ ఇదే పనిచేస్తే మినీ వైసీపీ అధినేతే ఉన్నట్లు అవుతుందన్నారు. విశాఖలో ప్రతీ కొండను మింగేస్తున్నారని ఆరోపించారు. అన్యాయాలను అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయని పవన్ కళ్యాణ్ గళమెత్తారు.
ప్రజాగ్రహానికి గురికాక తప్పదని.. అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలే వస్తాయని.. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడుతారని.. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు,పరుగులు పెట్టిస్తారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
మొత్తంగా వైసీపీ నేతల అరాచకాల కారణంగానే వారిపై పవన్ కళ్యాణ్ కు అంత కోపం వస్తుందని అర్థమైంది. ప్రజలను దోచుకుంటున్న వారి తీరు నచ్చకనే ఇలా పవన్ కళ్యాణ్ ద్వేషిస్తున్నారని అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా వైసీపీ నేతలు మారుతారా? వారిపై పవన్ మరో పోరాటానికి సిద్ధమవుతారా? అన్నది వేచిచూడాలి.