Viral Photo : ఒకప్పుడు యాడ్ లో కనిపించిన చాలామంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా కూడా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక యాడ్లో నటించి పాపులర్ అయిన అమ్మాయిలలో ఈమె కూడా ఒకరు. అప్పట్లో టీవీలో “బంటి నీ సబ్బు స్లోనా ఏంటి” అనే లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్ ప్రసారం అయ్యేది. ఆ యాడ్ లో తన క్యూట్ క్యూట్ మాటలతో అలరించిన ఈ చిన్నారి ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బంటి ఈ సబ్బు స్లోనా ఏంటి అనే యాడ్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ యాడ్ లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ కు సంబంధించింది. అప్పట్లో ఈ యాడ్ లో క్యూట్ గా నటించిన చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ఈమె ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా తన అందచందాలతో అందరిని అలరిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ అమ్మాయి మరెవరో కాదు అవనీత్ కౌర్. అవనీత్ కౌర్ డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్ ప్రోగ్రాం తో తన కెరీర్ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు టీవీ సీరియల్స్ లో, షోస్ లో, పలు యాడ్లలో నటించింది. ఈమె లైఫ్ బాయ్, మ్యాగీ, హిందుస్థాన్ లివర్ ఇలా 40 కి పైగా టాప్ బ్రాండ్ ఉన్న యాడ్స్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇలా పలు పాపులర్ యాడ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవనీత్ కౌర్ 2014లో మర్దానీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీదకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. గత ఎడాది రిలీజ్ అయిన టిక్కు వెడ్స్ షేరు, లవ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ అనే సినిమాలతో క్రేజీ బ్యూటీగా బీ టౌన్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే ఈ అమ్మడు లవ్ ఇన్ వియత్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.అవనీత్ కౌర్ కు నటనపరంగా చంద్రనందిని అనే సీరియల్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సీరియల్ లో అవనీత్ కౌర్ విలన్ పాత్రలో నటించి తనలో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది.
రోజు రోజుకు ఈమెకు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ బాగా పెరిగిపోతున్నారు.అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అవనీత్ కౌర్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.