Shobha Shetty Birthday Celebrations
Shobha Shetty Birthday : బుల్లితెర మీద సీరియల్స్ ద్వారా చాలామంది నటీనటులు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలా బుల్లితెర మీద తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన వాళ్లలో నటి శోభా శెట్టి కూడా ఒకరు. బుల్లితెర నటి శోభా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాటీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం అనే సీరియల్ లో శోభా శెట్టి విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో శోభా శెట్టి చాలా అద్భుతంగా నటించింది అని చెప్పచ్చు.ఈ సీరియల్ తో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో లో అడుగుపెట్టి ఇంకా క్రేజ్ ను సొంతం చేసుకుంది శోభా శెట్టి. బిగ్ బాస్ ఏడవ సీజన్లో అడుగుపెట్టిన శోభా శెట్టి తన ఆటతీరుతో, మాటలతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు లో పాల్గొన్న తర్వాత నటి శోభా శెట్టి కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఎక్కవ కాలం ఉండలేకపోయింది అని చెప్పచ్చు. ఇటీవల జరిగిన బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలో కూడా శోభా శెట్టి అడుగుపెట్టింది. అయితే ఈమె ఈ షోలో ఎక్కువ రోజులు ఉండలేనంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శోభా శెట్టి బర్త్డే వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ బర్త్డే వేడుకలో శోభా శెట్టి బిగ్ బాస్ స్నేహితులు తేజ, అమర్దీప్, ప్రియాంక జైన్ తదితరులు సందడి చేశారు. ఈ క్రమంలోనే గది మొత్తాన్ని అందంగా చుట్టూ బెలూన్లతో అలంకరించి శోభా శెట్టి చేత కేక్ కట్ చేయించారు ఆమె స్నేహితులు. ప్రస్తుతం ఈ బర్తడే వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
వీళ్ళందరూ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో సందడి చేసిన వారు. ఇక బిగ్ బాస్ ఏడవ సీజన్లో పల్లవి ప్రశాంత్ విజేతగా అలాగే బుల్లితెర నటుడు అమర్ దీప్ రన్నర్ అప్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటె శోభా శెట్టి తన సహనటుడు యశ్వంత్ ను గత కొన్ని ఏళ్ళ నుంచి ప్రేమించి ఇటీవలే నిశ్చితార్ధం చేసుకుంది.యశ్వంత్,శోభా శెట్టి నిశ్చితార్ధం బంధువులు,కుటుంబ సభ్యులు,స్నేహితుల మధ్య చాల గ్రాండ్ గా జరిగింది.ఇక వీరిద్దరి నిశ్చితార్ధానికి సంబంధించిన కొన్ని క్యూట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
అయితే శోభా శెట్టి తన సహనటుడు యశ్వంత్ తో గత కొన్ని ఏళ్ళ నుంచి ప్రేమలో ఉన్నట్లు బిగ్ బాస్ హౌస్ లో రివీల్ చేసింది.శోభా శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వీరిద్దరూ రింగులు కూడా మార్చుకున్నారు.యశ్వంత్,శోభా శెట్టి ఇద్దరు కార్తీక దీపం సీరియల్ లో కలిసి నటించారు.అయితే ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది.