
Salman Khan- Ram Charan: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఈయనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ క్యూ కట్టేస్తున్నారు. #RRR తర్వాత ఈయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళింది, ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా, రాజ్ కుమార్ హిరానీ తో ఒక సినిమా, డైరెక్టర్ సుకుమార్ మరియు బుచ్చి బాబు(ఉప్పెన ఫేమ్) లతో చెరొక సినిమా, ఇలా వరుసగా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.
అయితే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రం నుండి విడుదలైన ‘ఏంటమ్మా’ అనే సాంగ్ లో సల్మాన్ ఖాన్ మరియు విక్టరీ వెంకటేష్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో వేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ఈ పాట జానీ మాస్టర్ నేతృత్వం లో కంపోజ్ చెయ్యబడింది.హైదరాబాద్ లోనే ఈ సాంగ్ ని షూట్ చేసారు, అయితే ఈ పాట లో రామ్ చరణ్ ఉండడానికి గల కారణం ని సల్మాన్ ఖాన్ గత ఏడాది ‘గాడ్ ఫాదర్’ మీడియా ఇంటరాక్షన్ లోనే చెప్పుకొచ్చాడు.’చరణ్ ఒకరోజు సెట్స్ కి వచ్చాడు,వెంకటేష్ మరియు నా కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉందనే విషయాన్ని జానీ మాస్టర్ ద్వారా తెలుసుకున్నాడు. నాకు ఈ సాంగ్ లో మీతో పాటు కలిసి చేయాలనుంది భాయ్ అని అన్నాడు. అయ్యో పర్లేదు చరణ్ అని అవసరం లేదు అని నేను చెప్పాను. పక్క రోజు మనోడు కాస్ట్యూమ్స్ తో సెట్స్ లో ఉన్నాడు,నేను తనని చూసి ఆశ్చర్యపోయాను, నీకు ఏమి పర్లేదు కదా అని అడిగాను, మీకోసం నేను ఇది చెయ్యాలి భాయ్, నా తృప్తి కోసం అని చెప్పాడు.అలా ఆ సాంగ్ చిత్రీకరణ జరిగింది’ అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు, అందుకోసం గా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, అందుకు కృతజ్ఞతగా చరణ్ ఈ పని చేసాడట.