
China: చైనాలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. ఫలితంగా జనాభా తగ్గిపోతోంది. ఇదివరకు మేమిద్దరం మాకు ఇద్దరు అనే నినాదంతో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధన ఎత్తేసింది. ఎంత మందినైనా కనొచ్చని సూచిస్తోంది. దీంతో చైనాలో ఏటేటా తగ్గుతోంది. జనాభా తగ్గిపోవడంపై ఆందోళన చెందుతోంది. జనాభా పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. దేశంలో జనాభా తగ్గితే కలిగే పరిణామాలపై భయపడుతోంది. భవిష్యత్ లో జనాభా పెరుగుదల క్రమంగా ఆగిపోయే పరిస్థితి దాపురిస్తోంది. దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి. డ్రాగన్ ఇప్పుడు జనాభా పెరిగేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది.
40 కోట్ల మంది బ్రహ్మచారులు
చైనాలో 40 కోట్ల మంది బ్రహ్మచారులు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో యువత వివాహానికి మొగ్గు చూపడం లేదు. దేశంలో యువత ఒంటరి జీవితాన్ని గడిపేందుకు ఇష్టడుతున్నారు. దీంతో జననాల సంఖ్య తగ్గుతోంది. పెళ్లికాని ప్రసాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. జనాభా సంఖ్య తక్కువవుతోంది. అందరు పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో సంతాన సమస్యలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.
పిల్లలను కనేందుకు..
ప్రస్తుతం డ్రాగన్ ఎంత మందిని అయినా కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇన్నాళ్లు అధిక జనాభా కారణంతో కుటుంబ నియంత్రణ చర్యలు పాటించినా ప్రస్తుతం వాటిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఎంత మందిని కంటే అంత మొత్తంలో నజరానా ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. జనాభా పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జనాభా నియంత్రణ చర్యలను పక్కన పెట్టి జంటలు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇస్తోంది. దీని వల్ల జనాభాను పెంచుకోవాలని భావిస్తోంది.

జనాభా తగ్గడం
దేశంలో ముప్పయి ఏళ్లు దాటినా వివాహం చేసుకునేందుకు సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలపై దేశం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరితనంతో సతమతమవుతున్నారు. జనాభాను ఎలా పెంచుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. 2022 నాటికే 40 కోట్ల మంది పెళ్లికాని వారు ఉన్నారంటే ఇప్పటికి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఇలా పెళ్లికాని వారు పెరుగుతుంటే సంతానం ఎలా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దేశ జనాభాను పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు.