
Prabhas Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం పై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కొంతకాలం క్రితమే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది..వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది, కానీ విడుదల చేసిన టీజర్ కి గ్రాఫిక్స్ విషయం లో బాగా ట్రోల్ల్స్ రావడం, ఎదో కార్టూన్ సినిమాని చూస్తున్న అనుభూతి కలిగింది అంటూ కామెంట్స్ రావడం తో VFX రీ వర్క్ చెయ్యాలి నిర్ణయించుకున్నారు.
అందుకే ఈ సినిమాని జూన్ 16 వ తేదికి వాయిదా వేశారు.అయితే ఈ సినిమా వాయిదా పడిన తర్వాత ఒక్క అప్డేట్ కూడా లేకపోవడం పై ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ టీం పై చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు, అలాంటి ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక శుభవార్త.

అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని వచ్చే నెల ప్రథమార్థం లోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం.ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లోనే తెలియచెయ్యబోతుంది మూవీ టీం.రామాయణం ఇతిహాసం లో ఇప్పటి వరకు వెండితెర మీద తెరకెక్కని ఒక అరుదైన పాయింట్ ని ఆధారంగా తీసుకొని, మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ప్రభంజనం సృష్టించబోతోంది అనే నమ్మకం తో మూవీ టీం ఉన్నది.ఈ చిత్రం సీతగా కృతి సనన్ నటించగా, రావణాసురిడి పాత్ర సైఫ్ అలీ ఖాన్ నటించాడు.’తానాజీ’ వంటి సంచలనాత్మక సినిమా తీసిన ఓం రౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించాడు, మరి అభిమానులను ఈ సినిమా ఎంతమేరకు అలరిస్తుందో తెలియాలంటే జూన్ వరకు ఎదురు చూడాల్సిందే.