Werewolf Syndrome: ప్రపంచంలో ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి. కొన్ని రోగాలు కొందరికే వస్తాయి. కోట్లలో కొద్ది మందికే ఉండే ఇలాంటి లక్షణాలతో మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో నలుగురిలో తిరిగేందుకు ఇష్టపడకుండా భయడుతుంటారు. వారికి వచ్చిన లక్షణాలు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కావు. పూర్వ కాలంలో మనుషులు కోతి నుంచి ఆవిర్భవించారనే చెబుతారు. పూర్వీకులు ఎక్కువ రోమాలతో ఉండేవారని చరిత్ర చెబుతోంది. అందుకే మనకు శరీరం మీద వెంట్రుకలు రావడం సహజమే.

మధ్యప్రదేశ్ కు చెందిన లలిత్ పాటిదార్ (17)కు ఒళ్లంతా వెంట్రుకలే వచ్చాయి. ముక్కు, ముఖం అనే తేడా లేకుండా శరీరం మొత్తం వెంట్రుకలమయంగా మారిపోయాడు. దీంతో అందరు అతడిని చూసి భయపడుతున్నారు. ఇంకా కొందరు ఆశ్చర్యపోతున్నారు. వింతగా ఒళ్లంతా వెంట్రుకలు రావడం ఏమిటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అతడికి ఆరేళ్ల నుంచే వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అతడి ఒళ్లు మొత్తం వెంట్రుకలతో నిండిపోవడం గమనార్హం. దీంతో కొందరు అతడి రూపాన్ని చూసేందుకు జంకుతున్నారు.
పాఠశాలలో ఉండే విద్యార్థులు అందరు అతడిని ఆటపట్టిస్తున్నారు. జంతువులా ఉన్నావని ద్వేషిస్తున్నారు. దీంతో ఏం చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. వెంట్రుకలు పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటున్నా తరువాత మళ్లీ అలాగే పెరుగుతున్నాయి. అతడి శరీరం మొత్తం వెంట్రుకలతో నిండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మధ్యయుగం నాటి పురుషుల్లో ఇలాగే వెంట్రుకలు ఉండేవి. దీంతో అప్పటి మనుషుల విధంగా ఇప్పుడు రావడం అనుమానాలకు తావిస్తోంది. అతడిలో పూర్వీకుల డీఎన్ఏ ఉందేమోనని సందేహిస్తున్నారు. ఒళ్లంతా వెంట్రుకలతో జాంబవంతుడిలా మారాడు.

మధ్యయుగం నాటి నుంచి ఇప్పటి వరకు 50 మంది వరకు ఈ వ్యాధితో బాధపడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడు జీవితకాలం వెంట్రుకలతో సహజీవనం చేయాల్సిందే. ఇలా వెంట్రుకలతో కనిపించడంతో ఏదో వింత జంతువును చూసినట్లుగా చూస్తున్నారని అతడు వాపోతున్నాడు. తనకు కలిగిన ఈ దుస్థితికి బాధపడుతున్నాడు. తనకే ఎందుకు ఇలా జరిగిందని ఆవేదన చెందుతున్నాడు. జన్యుపరమైన ఇబ్బందులతోనే ఇలా వెంట్రుకలు పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి అతడి జీవితం మొత్తం వెంట్రుకలతోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనిపై భయపడాల్సిన పనిలేదని వైద్యులు సూచిస్తున్నారు. కానీ అతడు మాత్రం తనకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.