Bigg Boss 6 Telugu- Adi Reddy: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరిదశ కి చేరుకుంది..హౌస్ మేట్స్ అద్భుతమైన ఆటలతో..ఎన్నో భావోద్వేగాలు,కోపతాపాలు మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ సీజన్ కూడా సక్సెస్ అయిపోయింది..ప్రారంభం లో చాలా నత్తనడకన ఈ షో నడిచేసరికి బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే అతిపెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ సీజన్ మిగిలిపోతుందని అందరూ అనుకున్నారు..కానీ మూడవ వారం నుండి బిగ్ బాస్ గ్రాఫ్ పెరుగుతూనే పోయింది..ఆసక్తికరమైన టాస్కులతో హౌస్ ని రక్తికట్టించేలా చేసాడు బిగ్ బాస్..గత కొద్దీ వారల నుండి ఫిజికల్ టాస్కులకు పెద్దపీట వేసిన బిగ్ బాస్, ఈ వారం ఎంటర్టైన్మెంట్ మీదనే ఎక్కువ దృష్టిని సారించాడు..’బిగ్ బాస్ కోచింగ్ సెంటర్’ పేరిట ఒక టాస్కుని నిర్వహించి ఆది రెడ్డి ని డాన్స్ మాస్టర్ గా, శ్రీ సత్య ని మేకప్ మాస్టర్ గా మరియు రాజ్ ని సింగర్ గా నియమించాడు బిగ్ బాస్.

ఈ టాస్కులో డాన్స్ మాస్టర్ గా ఆదిరెడ్డి తన విశ్వరూపం చూపించేసాడు..వచ్చి రాని డాన్స్ స్టెప్స్ తో ఇంటి సబ్యులకు నేర్పిస్తూ కడుపుబ్బా నవ్వించాడు..రేవంత్ ఆది రెడ్డి తో మాట్లాడుతూ ‘భయ్యా..ఈ స్టెప్పులు బయట వేస్తే జనాలు టమోటోలతో కొడుతారు’ అని అంటాడు..అప్పుడు ఆదిరెడ్డి దానికి సమాధానం చెప్తూ ‘నాది చెప్పులతో కొట్టించుకునే డాన్స్..టమోటో రేంజ్ దగ్గరకి ఆగిపోయ్యవంటే పర్వాలేదు..బాగానే వేస్తున్నా అన్నమాట’ అంటూ కామెడీ చేస్తాడు.

అలా ఆది రెడ్డి డాన్స్ మాస్టర్ గా నిర్వహించిన టాస్కు ఎపిసోడ్ కి హై లైట్ గా మారింది..ముఖ్యంగా బంగారు కోడిపెట్ట సాంగ్ కి ఇంటి సభ్యులందరు ఆదిరెడ్డి డాన్స్ ని అనుకరించి డాన్స్ వెయ్యడం ప్రేక్షకులకు పొట్టచెక్కలు అయ్యేలా చేసింది..అలా ఎంటర్టైన్మెంట్ లో వీక్ అని మొదటి నుండి అనిపించుకుంటున్న ఆది రెడ్డి ఈరోజు జరిగిన టాస్కుతో తనని తానూ నిరూపించుకొని, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను కూడా కడుపుబ్బా నవ్వించాడు.