https://oktelugu.com/

Kurchi Thatha: బిచ్చగాడిగా మారిన కుర్చీ తాత… గుండెలు బరువెక్కించే వీడియో వైరల్!

గతంలో సోషల్ మీడియా జనాలకు మాత్రమే తెలిసిన కుర్చీ తాత గురించి గుంటూరు కారం సాంగ్ తర్వాత చాలా మందికి తెలిసొచ్చింది. ఈ కుర్చీ తాత ఎవరని వాకబు చేయడం స్టార్ట్ చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2024 / 02:10 PM IST

    Kurchi Thatha

    Follow us on

    Kurchi Thatha: సోషల్ మీడియా సెలబ్రిటీ బిచ్చగాడి అవతారం ఎత్తాడు. ఒక్క రూపాయి ధర్మం చేయండంటూ వేడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు షేక్ అహ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత. తనపైకి గొడ్డలితో వచ్చిన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి ***తే మెడలు ఇరిగిపోయాయని, షేక్ అహ్మద్ పాషా చెప్పిన ఆ డైలాగ్ వైరల్ అయ్యింది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఖాళీగా ఉండే షేక్ అహ్మద్ పాషా కాస్తా కుర్చీ తాతగా పాప్యులర్ అయ్యాడు.

    అతని మాట తీరు భిన్నంగా ఉండటంతో పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. దాంతో మరింత ఫేమ్ వచ్చింది. పవన్ కళ్యాణ్, కేటీఆర్ వంటి పొలిటీషియన్స్ ని కుర్చీ తాత తిట్టాడు. దాంతో అతనికి శత్రువులుగా కూడా ఏర్పడ్డారు.మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుండి థర్డ్ సింగిల్ విడుదల చేశారు. కుర్చీ తాత చెప్పిన ‘ఆ కుర్చీ మడతపెట్టి” అనే డైలాగ్ పాటలో వాడారు.

    గతంలో సోషల్ మీడియా జనాలకు మాత్రమే తెలిసిన కుర్చీ తాత గురించి గుంటూరు కారం సాంగ్ తర్వాత చాలా మందికి తెలిసొచ్చింది. ఈ కుర్చీ తాత ఎవరని వాకబు చేయడం స్టార్ట్ చేశారు. ఇక కుర్చీ మడతబెట్టి డైలాగ్ వాడుకున్నందుకు కుర్చీ తాతకు థమన్ డబ్బులు ఇచ్చాడని ప్రచారం జరిగింది. అందులో నిజమెంతో తెలియదు. సడన్ గా కుర్చీ తాత బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు.

    ఓ బస్సులో కుర్చీ తాత ఒక రూపాయి ఉంటే దానం చేయండి అని వేడుకుంటున్నాడు. నన్ను కుర్చీ తాత అంటారు. బిచ్చం వెయ్యండని ఆయన అభ్యర్దిస్తున్నాడు. ఈ వీడియో దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. సోషల్ మీడియా సెలబ్రిటీ ఇలా బిచ్చగాడుగా మారడం ఏంటని చాలా మంది వాపోతున్నారు. కుర్చీ తాతకు థమన్ నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.