https://oktelugu.com/

Bharateeyudu 2: కమల్ హాసన్, శంకర్ మధ్య గొడవల వల్లే సినిమా ఆగిపోయిందా? గొడవకు కారణమేటంటే?

కమల్ హాసన్, శంకర్ మధ్య గొడవ జరిగిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ గొడవకు కారణం ఏంటో తెలుసా? అయితే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే.

Written By: , Updated On : January 3, 2024 / 02:06 PM IST
Bharateeyudu 2

Bharateeyudu 2

Follow us on

Bharateeyudu 2: ఇండస్ట్రీలో కొందరి మధ్య ఇప్పటికీ గొడవలు జరుగుతుంటాయి. పిల్లి ఎలుక మాదిరి ఉండేవారు కూడా ఉన్నారు. కొందరు మాత్రం గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతుంటారు. ఇక స్టార్ల మధ్యనే కాదు వీరి అభిమానుల మధ్య మరింత ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు భారతీయడు 2 అనే సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా ను మొదలు పెట్టారు.

అయితే కమల్ హాసన్, శంకర్ మధ్య గొడవ జరిగిందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ గొడవకు కారణం ఏంటో తెలుసా? అయితే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో కమల్ మార్కెట్ భారీగా పెరిగింది. ఫ్లాప్ హీరోగా ఉన్న కమల్ ఒక్కసారిగా దిశ మార్చుకున్నాడు. దీంతో భారతీయుడు ప్రొడ్యూసర్లు కమల్ హాసన్ తో సినిమా చేయాలని శంకర్ ను కలిశారు. అయితే అప్పటికే వేరే సినిమాతో బిజీగా ఉన్న శంకర్ అది అవగానే ఈ సినిమా చేస్తానన్నారట. కానీ ప్రోడ్యూసర్లు ఒప్పుకోకపోవడంతో డైరెక్టర్ శంకర్ కాంప్రమైజ్ అయ్యారట.

భారతీయుడు సినిమా 4రోజులు షూటింగ్ జరిగితే 10 రోజులు వాయిదా పడేదట. దీనికి కారణం కమల్ హాసన్ కు, శంకర్ కు మధ్య ఉన్న గొడవ అంటూ టాక్. శంకర్ చెప్పిన సీన్లు కొన్ని కమల్ హాసన్ కు నచ్చడం లేదట. అందుకే ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతే షూట్ కు వెళ్లాలని డైరెక్టర్ ను అడుగుతున్నారట. దీంతో డైరెక్టర్ కూడా కాస్త ఫీల్ అయ్యారట. ఇలా ఇద్దరి మధ్య గొడవ మొదలైందని టాక్. ఈ విబేధాలు సద్దుమనిగి సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో అని ఎదురుచూస్తున్నారు కమల్ అభిమానులు.