Alekhya Chitti Pickles : కస్టమర్ అనే వాడు ఒక వ్యాపారానికి బలమైన ఇరుసు లాంటివాడు. ఈ ఇరుసును ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వ్యాపారం అంత బాగుంటుంది. ఎలాగూ ఇరుసు మోస్తోంది కదా అని చులకన చేసి చూస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామం వేరే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. సోషల్ మీడియా ఆధారంగా పుట్టిన ఉద్యమాలు ఏకంగా ప్రభుత్వాలనే పడగొడుతున్నాయి. కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాదు సెలబ్రిటీలకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ఇదే సోషల్ మీడియా చాలామందికి బతుకునిస్తోంది. కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. ఎక్కడో ఉన్న వారిని సైతం వెలుగులోకి తీసుకొస్తున్నది. అలా వెలుగులోకి వచ్చిన వారే “అలేఖ్య చిట్టి పికిల్స్”. ముగ్గురు అమ్మాయిలు కలిపి పెట్టిన ఓ దుకాణం ఇది. రాజమండ్రి కేంద్రంగా కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టారు. అందమైన యువతులు.. అందులోనూ సోషల్ మీడియాలో వీరికి విపరీతమైన పాపులారిటీ ఉండడంతో.. దానిని తమ పికిల్స్ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. అందులో విజయం కూడా సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నోటి దురుసు ఇందులోకి ప్రవేశించిందో.. అప్పుడే తేడా కొట్టేసింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా తన పని తాను చేసింది. మధ్యలో మీడియా ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది కన్నీరు మిగిలింది. చివరికి దుకాణం సర్దేసుకోవాల్సి వచ్చింది.
Also Read : అలేఖ్య చిట్టి పికిల్స్ పై స్పందించిన ట్రంప్.. ఇది మామూలు ర్యాంగింగ్ కాదు
ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం
ఒక మనిషి తప్పు చేస్తే.. సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయోగించే అస్త్రం ఏడుపు.. ఇప్పుడు ఇదే ఏడుపును “అలేఖ్య చిట్టి” ప్రయోగిస్తోంది. వాస్తవానికి రేటు ఎక్కువగా ఉందని చెప్పిన కస్టమర్ ను బూతులు తిట్టకుండా ఉండి ఉంటే బాగుండేది. కానీ అడ్డగోలుగా బూతులు తిట్టి.. ఇష్టానుసారంగా మాట్లాడి.. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు.. ఈ పచ్చళ్ళు కొనలేకపోతున్నావ్.. రేపు భార్యను ఏ విధంగా చూసుకుంటావు.. అని అడ్డగోలుగా మాట్లాడిన రోజు నోటిని అదుపులో పెట్టుకుంటే బాగుండేది. కానీ ఇక్కడే అలేఖ్య చిట్టి సోషల్ మీడియాను తప్పుగా అంచనా వేసింది. తన ఎదుగుదలకు మార్గంగా ఉపయోగపడ్డ సోషల్ మీడియాను అలేఖ్య చిట్టి లైట్ తీసుకుంది. ఫలితంగా ఇప్పుడు దాని తాలూకు ఫలితాన్ని అనుభవిస్తోంది. అందుకే అంటారు పెద్దలు నోటి దురుసును తగ్గించుకోవాలి. మాట తీరును పెంపొందించుకోవాలని.. ఆ విషయాన్ని అలేఖ్య చిట్టి విస్మరించింది. ఇప్పుడు తీరిగ్గా ఏడుపు లంకించుకుంది.. దానికంటే ముందు ఒక క్షమాపణ కూడా చెప్పింది. ఈ క్షమాపణ చెప్పే విషయంలోనూ.. ఎంతో మందిని తను తిట్టానని.. వారందరూ తనను క్షమించాలని కోరింది. అంటే నడ మంత్రపు సిరితో.. నాడ మంత్రపు వ్యాపారంతో అలేఖ్య చిట్టి అడ్డగోలుగా మాట్లాడిందన్నమాట.. ఇలాంటి వారి దగ్గర పచ్చళ్ళు కొనడం కంటే.. బ్లాక్ చేయడమే ఉత్తమం.. నిరసన తెలపడమే ఉత్తమం అని.. నెటిజన్లు భావించి ఆమెపై ఉద్యమమే చేశారు. అందువల్లే అలేఖ్య చిట్టి వ్యాపారాన్ని మూసుకోవాల్సి వచ్చింది. చివరికి సోషల్ మీడియా అకౌంట్లను క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది.
Papam… Don’t troll her pic.twitter.com/dulDHgKMjr
— Sandhya Reddy YSCRP (@SandhyaSamayam) April 5, 2025