Alekhya Chitti Pickles: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో అలేఖ్య చిట్టి(Alekhya Chitti Pickles) ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం ఈమె గురించి మాట్లాడుకుంటుంది. కస్టమర్స్ తో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఒక ఆడియో రికార్డు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం వల్లే ఇంత పెద్ద విద్వంసం జరిగింది. పికిల్ రేట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి ఏంటండీ అని ఒక కస్టమర్ అడిగినందుకు గాను, అతన్ని ఇష్టమొచ్చినట్టు తిట్టి, నువ్వు జీవితం లో స్థిరపడలేవు, ప్రేమ పెళ్లి లాంటివి పెట్టుకోకు, రేపు నీ పెళ్ళాం ఏదైనా బంగారం అడిగితే ఎక్కడి నుండి తీసుకొస్తావు?, పికిల్స్ నే కొనలేని వాడివి, నీకెందుకు పెళ్లి అంటూ దుర్భాషలాడింది. ఈ ఆడియో రికార్డు పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏకిపారేశారు.
Also Read: ఎంపురాన్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..300 కోట్లకు అతి చేరువలో!
ముగ్గురు అక్కాచెల్లెల్లు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకించి క్షమాపణలు కూడా చెప్పారు, కానీ జనాలు క్షమించడం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళ పోస్టుల క్రిందకు చేరి బండబూతులు తిడుతున్నారు. కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి, సెలెబ్రిటీలు సైతం తమ సినిమా ప్రొమోషన్స్ ఈ వివాదాన్ని ఉపయోగించుకొని ఫన్నీ సెటైర్ వీడియోలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇక ఈ వివాదాన్ని కొనసాగించకుండా ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఎందుకంటే అలేఖ్య చిట్టి చాలా చిన్న అమ్మాయి. ఆమె ఈ నెగటివిటీ ని తట్టుకోలేక అనారోగ్యానికి గురై ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. ప్రస్తుతం ఆమె మాట్లాడలేని పరిస్థితి లో ఉందట. ఈ విషయాన్నీ ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు. ఆ ఆడబిడ్డలు నాకు చెల్లెల్లు అవుతారు. గతంలో వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతోనే పికిల్స్ వ్యాపారం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యాపారం కుప్పకూలిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు.
అలేఖ్య మరియు ఆమె సోదరీమణులు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సహకారం లేకుండా, సొంత కష్టంతో ఈ స్థాయికి ఎదిగారు. తమకు తోడుగా ఉన్న ఒక్కగానొక్క తండ్రి చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఎలాంటి మనోధైర్యాన్ని కోల్పోకుండా, బలంగా నిలబడి ఈ స్థాయికి ఎదిగి ఎంతోమంది ఆడవాళ్ళకు ఆదర్శంగా నిలిచారు. ఎవ్వరిని మోసం చేయలేదు, నిజాయితీగా తమ వ్యాపారం ఎదో తాము చేసుకుంటున్నారు. ఎదో తెలియని కొన్ని సందర్భాల్లో మనం కూడా సహనం కోల్పోతూ ఉంటాము. మనకు తెలియకుండా నోటి నుండి బూతులు వస్తుంటాయి. అలేఖ్య చిట్టి కూడా మన లాంటి సాధారణమైన మనిషే కదా, ఆమెకు కూడా కోపం చిరాకు వంటివి ఉంటాయి. రోజుకు ఎన్నో వేల మెసేజిలు వస్తుంటాయట వాళ్లకు, కొంతమంది కస్టమర్లు అడ్డమైన బూతులు కూడా తిడుతుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒకరి మీద చూపించాల్సిన కోపం మరొకరి మీద చూపించి ఉండొచ్చు. దయచేసి పాపం ఆ అమ్మాయిని ఇక వదిలేయండి.