
Krithi Shetty: ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం అంటే సాధారణమైన విషయం కాదు, అతి కొద్దిమందికి మాత్రమే ఆ అరుదైన అదృష్టం కలుగుతుంది.అదృష్టం తో పాటు టాలెంట్ కూడా బోలెడంత ఉండాలి, అప్పుడే అలాంటి స్టార్ స్టేటస్ కి ఎవరైనా చేరుకోగలరు.అలాంటి స్టేటస్ కి రీచ్ అయినా అతి కొద్దిమంది హీరోయిన్స్ లో ఒకరు కృతి శెట్టి.
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ అమ్మాయి తొలి సినిమాతోనే తన అందం తో కుర్రకారులకు పిచ్చెక్కిస్తూనే,మరోపక్క అద్భుతమైన అభినయం ని కనబర్చి టాలీవుడ్ కి మరో స్టార్ హీరొయిన్ దొరికేసింది అని అందరికీ అనిపించేలా చేసింది..ఈ సినిమా తర్వాత ఆమె చేసిన శ్యామ్ సింగ రాయ్ మరియు బంగార్రాజు వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి..దీనితో ఈ అమ్మడి కెరీర్ డైలమాలో పడింది.
అతి త్వరలోనే ఆమెని స్టార్ హీరోల సినిమాల్లో చూస్తామని అనుకున్నారు అందరూ..కానీ కుర్ర హీరోలు కూడా ఈంతో సినిమాలు చెయ్యడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.సక్సెస్ లేకపోతే ఒక హీరొయిన్ కి ఎంత క్రేజ్ ఉన్నా కూడా అవకాశాలు ఇవ్వడానికి భయపడుతారా..? అని చెప్పడానికి ఉదాహరణ ఈమెనే.రీసెంట్ గా ఈమె శర్వానంద్ మరియు శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే చిత్రం లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.రేపో మాపో షూటింగ్ లో పాల్గొనబోతుంది అని అనుకుంటుండగా ఆమెని సినిమా నుండి తప్పించేసాడు.రీసెంట్ గా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న వీడియో ని విడుదల చేసారు.

అందులో కృతి శెట్టి లేకపోవడం చర్చనీయాంశం గా మారింది.ప్రస్తుతం ఆమె నాగ చైతన్య తో కలిసి ‘కస్టడీ’ అనే చిత్రం చేసింది.షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ సినిమా మీదనే ఆమె కెరీర్ ఆధారపడి ఉన్నది.హిట్ అయితే మళ్ళీ ఆమెకి అవకాశాలు వస్తాయి,లేదంటే ఇక ఆమె కెరీర్ ముగిసినట్టే అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
