https://oktelugu.com/

Viral Video: మీ రీల్స్ దరిద్రం పాడుగాను.. ఒంటిమీద ఒకే ఒక్క. నూలుపోగుతో ఏందీ చండాలం.. చివరికి ఇండియా గేట్ ను కూడా వదలరా!

అప్పట్లో టిక్ టాక్ ఉన్నప్పుడు.. రీల్స్ చేస్తూ ఎంతోమంది సెలబ్రిటీలు అయిపోయారు. భారత ప్రభుత్వం ఆ యాప్ ను రద్దు చేసిన తర్వాత.. ఇప్పుడు ఆ దరిద్రం మొత్తం మిగతా సామాజిక మాధ్యమాలను చుట్టుకుంది. ఆ చండాలం మొత్తం మిగతా దాంట్లో కనిపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 21, 2024 / 02:44 PM IST

    Viral Video(8)

    Follow us on

    Viral Video: సాధారణంగా ఇండియా గేట్ అంటే.. ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన యోధులు గుర్తుకొస్తారు. వారి స్మృత్యర్థం ఆ కట్టడాన్ని అక్కడ నిర్మించారు. ఇప్పటికి రోజుకు వేలాదిమంది ఆ కట్టడాన్ని సందర్శిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకుంటారు. ఆ కట్టడాన్ని చూసినా.. ఆ ప్రాంతాన్ని చూసినా భావోద్వేగంతో కన్నీరు రాల్చుతారు. అలాంటి ప్రాంతాన్ని ఓ యువతి తన నెత్తి మాసిన రీల్స్ కోసం వేదికగా చేసుకుంది. పోనీ ఆ రీల్ లో ఏమైనా వీరుల గురించి చెప్పిందా? వారి త్యాగాల గురించి వివరించిందా? వారి గొప్పతనం గురించి మాట్లాడిందా? అంటే లేదు.. ఒంటి పై ఒకే ఒక్క నూలు పోగుతో దర్శనమిచ్చింది. పైగా దాన్ని అటు ఇటు తిప్పుతూ చూసేవాళ్లను రెచ్చ గొట్టింది. అసలే యువతి, ఆ పై పడుచు పిల్ల.. చూసేవాళ్ళు కన్నుల పండుగ చేసుకున్నారు. కొందరు ఆమె చేస్తున్న దరిద్రాన్ని తమ ఫోన్లలో వీడియో తీశారు. దానిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ యువతిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

    ఒళ్ళు కొవ్వెక్కి..

    సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. రీల్స్ చేసే బ్యాచ్ ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఇలా రాయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో మేము పశ్చాత్తాప పడాల్సిన అవసరం కూడా లేదు. గుడి, బడి, ఇండియా గేట్ అని తేడా లేకుండా ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ.. పైగా సెలబ్రిటీలం అని బిల్డప్ ఇస్తూ.. వారు చేస్తున్న పనులు అన్నీ ఇన్నీ కావు. ఆ మధ్య కేరళలో ఓ జంట ఒంటి పై నూలు పోగు లేకుండా ఫోటోషూట్ చేశారు. దానిని వీడియో కూడా తీశారు. ఆ తర్వాత రీల్స్ మాదిరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో కొండ చివరి అంచున ఓ యువతి రీల్ చేసింది . కాలుజారి లోయలో పడి దుర్మరణం చెందింది. ఆ మధ్య కర్ణాటకలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలు ఉన్నాయి. ఆయనప్పటికీ ఈ నడ మంత్రపు తరానికి అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాలనే ప్రయత్నం కూడా జరగడం లేదు. చేతిలో ఫోన్, అపరిమితమైన డాటా.. ఇంకేముంది పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు. చివరికి దాచుకోవాల్సిన వాటిని కూడా చూపించేస్తున్నారు. కప్పుకోవాల్సిన వాటిని బహిర్గతం చేస్తున్నారు..చూసే వాళ్ళకు ఆనందం.. విప్పి చూపించే వాళ్లకు సోషల్ మీడియా వికృతం.. కానీ ఇక్కడే వారు ఏ స్థాయికి దిగజారి పోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు.