Kodali Nani- NTR: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌకగా మారుతోంది. నాయకత్వ లోపం ఆ పార్టీని వెంటాడుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వయోభారం అడ్డు రావడంతో పార్టీకి సరైన నాయకుడు లేరని చెబుతున్నారు. దీంతోనే రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి నాయకత్వ బాధ్యత ఇబ్బందిగా పరిణమిస్తోంది. 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ ఇక గద్దెనెక్కడం అంత సులువు కాదని అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో టీడీపీ భవితవ్యం మరింత గందరగోళంగా కానుంది.

టీడీపీకి గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించి పార్టీకి ఓటుబ్యాంకు సాధించిన ఆయనను కావాలనే తొక్కెస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ డీఎన్ ఏ లేకుండా చేసేందుకు బాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో నారా లోకేష్ కు అడ్డు వస్తాడనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఎన్టీఆర్ బీసీల నేతగా ఎంతో కీర్తి సాధించారు. టీడీపీకి బీసీలను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఎన్టీఆర్ ను పార్టీలోకి రానీయకుండా చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.
లోకేష్ కు అంతటి సామర్థ్యం లేదు. నోట్లో నాలుకలేని నాయకుడిగా లోకేష్ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఆయనకు లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ మనుగడ సాధిస్తుందనే వాదనలు ఉన్నా పార్టీలో ఇంతవరకు ఎన్టీఆర్ గురించి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ వారసత్వాన్ని టీడీపీకి దూరం చేసేందుకే బాబు భావిస్తున్నారనే వాదనలకు నాని ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ బతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ ఆగమనం అవసరమే అని పలువురు పార్టీ నేతలు సూచిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ప్లస్ అవుతుంది. వైసీపీ దూకుడుకు కట్టడి వేసే సత్తా ఆయనకే ఉంది. లోకేష్ నోరు విప్పితే తప్పులే. మాట తడబడుతుంది. దీంతో ఆయన పార్టీని నడపడం అంత తేలిక కాదు. పార్టీ మరింత పాతాళంలోకి పోవడం ఖాయమే. ఈక్రమంలో ఏపీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఎన్టీఆర్ పాత్ర అవసరమని తెలిసినా బాబు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. దీంతో పార్టీ మనుగడపై సందిగ్ధం నెలకొంటోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదని తెలిసినా బాబు మాత్రం నోరు విప్పడం లేదు.
ఇప్పటికే వైసీపీ తన పునాదులను మరింత గట్టి పరుచుకుంటోంది. వైసీపీని నిలువరించాలంటే జూనియర్ ఎన్టీఆర్ తోనే సాధ్యం అని పలువురు ఇదివరకే సూచించినా బాబు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఫలితంగా టీడీపీకి మరోమారు అపజయమే వెంటాడనుంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉంది. ఆయన డైలాగులకు అందరు ఫిదా అవుతారు. అందుకే ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం తీసుకొస్తే ఫలితాలు వేరేలా ఉంటాయని ాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.