Odisha Husband And Wife: ఆలుమగల మధ్య గొడవలు పొద్దున్నే వచ్చి సాయంత్రం కనుమరుగవుతుంటాయి. సాయంత్రమైతే చాలు వారి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. ఇద్దరు ఏకమైపోతుంటారు. దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు కామనే. వాటిని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగానూ మామూలుగా చూస్తే చిన్నగాను కనిపిస్తాయి. కానీ కొందరికి పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఓ విదేశీ రాణి తన భర్త తిట్టాడని జీవితాంతం అంటే చచ్చిపోయే వరకు కూడా భర్తతో మాట్లాడలేదంటే ఆమె కోపం ఎంత దారుణంగా మారిందో తెలిస్తేనే షాక్ కలుగుతుంది.

భార్యాభర్తల మధ్య అపార్థాలకు తావుండకూడదు. నిజాయితీయే వారికి ప్రాణంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామి విషయంలో ఎన్ని గొడవలున్నా ఒక రోజో లేక రెండు రోజులో అలుగుతారు. ఇక్కడ మాత్రం ఓ భర్త భార్యపై అలిగి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 ఏళ్లుగా అన్నం ముట్టుకోకుండా ఉంటున్నాడంటే ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. దీంతో ఆ భర్త భార్యపై కోపంతో ఇన్నాళ్లుగా అన్నానికి దూరంగానే ఉంటున్నాడు. ఏదో ఒకసారి జరిగిన పొరపాటుకు నలభై రెండేళ్లుగా శిక్షిస్తూనే ఉన్నాడు.
ఎవరైనా కోపం వస్తే ఒక రోజు అన్నం మానేస్తారు. లేదా రెండు రోజులు దూరంగా ఉంటారు. కానీ ఒడిశాకు చెందిన ఓ భర్త మాత్రం 42 ఏళ్లుగా అలిగి కేవలం టీ తాగుతూ అటుకులు తింటూ కాలం వెళ్లదీస్తున్నాడు. జైపుర్ జిల్లాలోని నికీపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర (76)కు 22 ఏళ్ల వయసులో సీతతో వివాహం జరిగింది. ఒక రోజు భర్త కూలి పనికి వెళ్లి వచ్చి అన్నం పెట్టమని భార్యను అడిగాడు. దీంతో అనారోగ్యంగా ఉండటంతో ఆమె అన్నం వండలేదు. రామచంద్రకు అన్నం వడ్డించలేదు.
పనికి వెళ్లొచ్చినా తనకు అన్నం పెట్టని భార్యపై అలిగాడు. పరిస్థితిని అర్థం చేసుకోని అతడు అప్పటి నుంచి అన్నం ముట్టడం లేదు. ప్రతి రోజు అటుకులు తింటూ టీ తాగుతూ బతుకుతున్నాడు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేయలేదు. మాటలు మాట్లాడుకోవడమే కానీ అన్నం విషయంలో మాత్రం అతడి మనసు మార్చుకోలేదు. అన్నం తినమని ఎంత చెప్పినా వినడం లేదు. ససేమిరా అంటున్నాడు. అన్నం తిననని తెగేసి చెబుతున్నాడు. ఏదో ఒక రోజు జరిగిన దానికి ఇన్నాళ్ల శిక్ష వేయడం ఏమిటని అందరు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు.

ఏదో ఒక పూట జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇన్నేళ్లుగా సాధించడం తగదని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. అన్నం జోలికి వెళ్లడం లేదు. భార్య పరిస్థితిని అర్థం చేసుకోని భర్త ఆ సంఘటననే తలుచుకుంటూ ఇన్నాళ్లు అన్నం మానేయడం ఆందోళనలకు తావిస్తోంది. భార్యపై ఎంత కోపం ఉన్నా ఇంతటి శిక్ష వేయడం తగదు. కానీ అతడు మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. తన పంతం వీడటం లేదు. అనుకున్నది సాధించేందుకే అన్నం ముట్టడం లేదని పలువురు చెబుతున్నారు.