
House Keys: మనం కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాస్తు చూసుకోవాల్సిందే. పక్కా వాస్తు లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి జాగ్రత్తలు తీసుకుంటాం. ఎన్ని విధాలుగా వాస్తు లోపాలు ఉండకుండా చూసుకున్నా ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటే మనకు నీడలా వెంటాడుతుంది. దీంతో మనకు అన్ని అశుభాలే కలుగుతాయి. మనం ఏ పని చేసినా కలిసి రాదు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. తరచూ గొడవలు రావడం వంటివి చోటుచేసుకోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. ఈ నేపథ్యంలో మనం దాచుకునే తాళం చెవులు కూడా మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయని ఎంత మందికి తెలుసు.
తాళం చెవులు ఎక్కడ పెట్టాలి?
చాలా మంది తాళం చెవులను ఎక్కడో ఓ చోట పడేస్తూ ఉంటారు. కానీ అది కరెక్టు కాదు. దానికి కూడా ఓ ప్రత్యేకమైన చోటు ఉంటుంది. ఇంట్లో తాళాలను నిర్దిష్టమైన ప్రాంతంలోనే పెట్టాలని చెబుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. ఇంట్లో తాళాలు, తాళం చెవుల విషయంలో కచ్చితంగా ఉండాలని తెలుసుకుని భద్రపరచుకోవాలి. లేదంటే ఇంట్లో అశుభ ఫలితాలు రావడానికి కారణమవుతుంది. తాళాలను కూడా సరైన దిశలోనే ఉంచుకోవాలి.
హాల్లో పెట్టకూడదు
తాళాలను ఎప్పుడు కూడా హాల్లో పెట్టకూడదు. ఇంట్లోకి వచ్చే వారు తాళాలు, తాళం చెవులను చూడటం వల్ల ప్రతికూల ప్రభావాలు పడతాయి. దీని వల్ల జీవితంలో కష్టాలు కూడా వస్తాయి. అందుకే హాల్లో తాళంచెవులు ఉంచడం శ్రేయస్కరం కాదు. ఆగ్నేయంలో తాళం చెవులను దాస్తుంటారు. వంట గది సమీపంలో పూజా గది ఉంటుంది. దీని వల్ల అక్కడ తాళం చెవులు ఉంచడం మంచిది కాదు. ప్రతికూల ప్రభావాలు వస్తాయి. వంటగది, పూజా గదికి సమీపంలో తాళం చెవులు ఉంచుకోవడం మంచిది కాదని తెలుసుకోవాలి.
పశ్చిమ దిశలో..
తాళం చెవులను పశ్ఛిమ దిశలో పెట్టడం మంచిదే. ఏదైనా ఆస్తిని విక్రయించాలని భావించినప్పుడు దానికి సంబంధించిన పత్రాలు, తాళం చెవులను నైరుతి దిశలో ఉంచుకుంటే శుభమే అని చెబుతున్నారు. దీని వల్ల ఆర్థిక లావాదేవీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని నమ్మకం. ఇంటి తాళం చెవులు వాహనాల తాళాలు ఆఫీసు లాకర్ తాళాలను వాయువ్య దిశలో ఉంచుకోవడం వల్ల లాభాలు కలుగుతాయి. దీంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇలా తాళం చెవుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

హ్యాంగర్ ఉపయోగించాలి
తాళాలు, తాళంచెవులను జాగ్రత్త పరచడానికి చెక్క హ్యాంగర్ ఉపయోగించడం శ్రేయస్కరం. పొరపాటున కూడా ప్లాస్టిక్ హ్యాంగర్లను వాడకూడదు. చెక్క హ్యాంగర్ అయితేనే మంచిది. ఇతర మెటీరియల్ తో తయారు చేసిన వాటిని హ్యాంగర్ గా ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలు వస్తాయి. ఇలా తాళం చెవుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మనకు దుష్ఫలితాలే ఎదురవుతాయి. అందుకే వాటిని దాచుకునే విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. వాటిని కూడా సరైన చోట దాచుకుని మనకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.